జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను నిబంధనలకు విరుద్ధంగా హోటళ్లు, టీ స్టాళ్లు, టిఫిన్ సెంటర్లలో వ్యాపార నిమిత్తం ఉపయోగిస్తున్నారనే సమాచారంతో పౌర సరఫరా శాఖ, రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వ్యాపార అవసరాలకు వాడుతున్న 22 గృహ వినియోగ సిలిండర్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు ఆర్ఐ అన్వేష్ తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.

