prajavaani.net
Newspaper Banner
Date of Publish : 13 October 2026, 12:12 pm Digital Edition : UPPU RAMESH JAGITHYAL

రాజారాంపల్లిలో కమర్షియల్ వినియోగంలో ఉన్న 22 డొమెస్టిక్ గ్యాస్ సిలిండర్ల సీజ్

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం రాజారాంపల్లి గ్రామంలో గృహ వినియోగ గ్యాస్ సిలిండర్లను నిబంధనలకు విరుద్ధంగా హోటళ్లు, టీ స్టాళ్లు, టిఫిన్ సెంటర్లలో వ్యాపార నిమిత్తం ఉపయోగిస్తున్నారనే సమాచారంతో పౌర సరఫరా శాఖ, రెవెన్యూ అధికారులు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో వ్యాపార అవసరాలకు వాడుతున్న 22 గృహ వినియోగ సిలిండర్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేసినట్లు ఆర్‌ఐ అన్వేష్ తెలిపారు. నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు.