📄 ePaper
Epaper 2
Tuesday, October 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్కిష్టాపూర్‌లో బతుకమ్మ ఘాట్ల వద్ద లైటింగ్‌, పారిశుద్ధ్య ఏర్పాట్లు చేయాలి

కిష్టాపూర్‌లో బతుకమ్మ ఘాట్ల వద్ద లైటింగ్‌, పారిశుద్ధ్య ఏర్పాట్లు చేయాలి

📰 Generate e-Paper Clip

q
డిప్యూటీ కమిషనర్‌కు మాజీ కౌన్సిలర్ తుడుం గణేష్ వినతి

మేడ్చల్‌: పూడూర్‌–కిష్టాపూర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని కిష్టాపూర్‌లో బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని మాజీ కౌన్సిలర్ తుడుం గణేష్ కోరారు. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు.
W
ఈ సందర్భంగా తుడుం గణేష్ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగను మహిళలు, ప్రజలు సంతోషంగా నిర్వహించుకునేందుకు ఘాట్ల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. బతుకమ్మ ఆడే ప్రదేశాల్లో లైటింగ్‌, సౌండ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయడంతో పాటు ఘాట్లకు పెయింటింగ్‌ వేయించి విద్యుత్‌ దీపాలు అమర్చాలని విజ్ఞప్తి చేశారు. పండుగ సమయంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా మున్సిపల్‌ సిబ్బందిని నియమించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని కోరారు.

అదేవిధంగా దసరా పండుగ రోజున కిష్టాపూర్‌లోని జమ్మి ములక్కాత్‌ సెంటర్‌ వద్ద తగిన లైటింగ్‌ ఏర్పాటు చేయాలని తెలిపారు. రావణాసురుడి దహన కార్యక్రమానికి అవసరమైన ఏర్పాట్లు ముందుగానే పూర్తి చేయాలని కోరారు. జమ్మి పూజ నిర్వహించే స్థలంతో పాటు పరిసర ప్రాంతాలను శుభ్రం చేసి, ప్రజలు ప్రశాంతంగా పూజలు నిర్వహించుకునేలా చర్యలు తీసుకోవాలని మున్సిపల్‌ అధికారులకు విజ్ఞప్తి చేశారు.

బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ప్రజలకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అధికారులు స్పందించి అవసరమైన ఏర్పాట్లు త్వరితగతిన పూర్తి చేయాలని తుడుం గణేష్‌ కోరారు.

ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్ తుడుం గణేష్‌, మంత్రి కుమార్‌ పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.