కిష్టాపూర్‌లో బతుకమ్మ ఘాట్ల వద్ద లైటింగ్‌, పారిశుద్ధ్య ఏర్పాట్లు చేయాలి

q డిప్యూటీ కమిషనర్‌కు మాజీ కౌన్సిలర్ తుడుం గణేష్ వినతి మేడ్చల్‌: పూడూర్‌–కిష్టాపూర్‌ కార్పొరేషన్‌ పరిధిలోని కిష్టాపూర్‌లో బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించాలని మాజీ కౌన్సిలర్ తుడుం గణేష్ కోరారు. ఈ మేరకు డిప్యూటీ కమిషనర్‌కు వినతిపత్రం సమర్పించారు. W ఈ సందర్భంగా తుడుం గణేష్ మాట్లాడుతూ, బతుకమ్మ పండుగను మహిళలు, ప్రజలు సంతోషంగా నిర్వహించుకునేందుకు ఘాట్ల వద్ద తగిన ఏర్పాట్లు చేయాలని కోరారు. బతుకమ్మ ఆడే ప్రదేశాల్లో లైటింగ్‌, సౌండ్‌ సిస్టమ్‌ ఏర్పాటు చేయడంతో పాటు...