📄 ePaper
Epaper 2
Tuesday, October 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసృజనాత్మకతకు ‘పోలీస్’ సలాం

సృజనాత్మకతకు ‘పోలీస్’ సలాం

📰 Generate e-Paper Clip

*సృజనాత్మకతకు ‘పోలీస్’ సలాం!*

* అమరవీరుల త్యాగాలు, పోలీసుల సేవలను ప్రతిబింబించేలా షార్ట్ ఫిల్మ్, ఫోటోగ్రఫీ పోటీలు!

* విజేతలకు జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో బహుమతులు!

* ఈ నెల 23 లోగా ఎంట్రీలు పంపాలి: మహబూబాబాద్ జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్!

కేసముద్రం అక్టోబర్ 12,ప్రజావాణి.

సమాజ రక్షణ కోసం అహర్నిశలు శ్రమిస్తున్న పోలీసుల నిరంతర సేవలు, అమరవీరుల అజరామర త్యాగాలను దృశ్యరూపంలో ఆవిష్కరించేందుకు మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ సరికొత్త వేదికను సిద్ధం చేసింది. పోలీస్ ఫ్లాగ్ డే వారోత్సవాలను పురస్కరించుకుని జిల్లా వ్యాప్తంగా షార్ట్ ఫిల్మ్, ఫోటోగ్రఫీ పోటీలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఎస్పీ డా. శబరీష్, ఐపీఎస్ సోమవారం ఒక ప్రకటనలో వెల్లడించారు. శాంతిభద్రతల పరిరక్షణతో పాటు ప్రజల భద్రత కోసం పోలీసులు చేస్తున్న కృషిని, వారిలోని మానవీయ కోణాన్ని ప్రజలకు మరింత చేరువ చేసేందుకు ఈ పోటీలు దోహదపడతాయని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.ఈ పోటీల్లో ఫోటోగ్రాఫర్లు, వీడియోగ్రాఫర్లు, సృజనకారులు, యువత పెద్ద సంఖ్యలో పాల్గొని తమ ప్రతిభను చాటుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు.
• షార్ట్ ఫిల్మ్ నిడివి: గరిష్టంగా 3 నిమిషాలు మాత్రమే ఉండాలి.
• పోటీల ప్రధానాంశాలు: పోలీసుల విధులు, ప్రజలతో స్నేహపూర్వక సంబంధాలు (ఫ్రెండ్లీ పోలీసింగ్), అమరవీరుల త్యాగాలు, మహిళలు-పిల్లల భద్రత, ట్రాఫిక్ నిబంధనలు, రోడ్డు భద్రత, నేరాల నియంత్రణ, సామాజిక అవగాహన వంటి సామాజికాంశాలపై సృజనాత్మక చిత్రాలు, ఇటీవల తీసిన ఉత్తమ ఛాయాచిత్రాలను పోటీకి పంపాల్సి ఉంటుంది.పోటీల్లో పాల్గొనదలచిన అభ్యర్థులు తమ సృజనాత్మక ఎంట్రీలను ఈ నెల 23.10.2026 లోగా జిల్లా ఎస్పీ కార్యాలయానికి అందజేయాల్సి ఉంటుంది. అభ్యర్థులు పూర్తి వివరాల కోసం జిల్లా పోలీస్ ప్రజాసంబంధాల అధికారి ( పి ఆర్ ఓ ) కుశల్ కుమార్‌ను 7702513469 నంబర్‌లో సంప్రదించి, తమ ఎంట్రీలను గడువులోగా సమర్పించాలని కోరారు.

*రాష్ట్ర స్థాయిలో డీజీపీ చేతుల మీదుగా అవార్డులు!*

జిల్లా స్థాయిలో న్యాయనిర్ణేతల కమిటీ ద్వారా ఎంపిక చేసిన టాప్-3 ఉత్తమ షార్ట్ ఫిల్మ్‌లు, మూడు ఉత్తమ ఛాయాచిత్రాల విజేతలకు జిల్లా ఎస్పీ డా. శబరీష్ చేతుల మీదుగా బహుమతులు, ప్రశంసాపత్రాలు అందజేస్తారు. అంతేకాకుండా, జిల్లా స్థాయిలో విజేతలుగా నిలిచిన టాప్-3 ఎంట్రీలను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేస్తారు. రాష్ట్ర స్థాయిలో ప్రతిభ కనబరిచిన వారికి తెలంగాణ రాష్ట్ర డీజీపీ చేతుల మీదుగా ప్రతిష్టాత్మక బహుమతులు, ప్రశంసాపత్రాలు అందుతాయని ఎస్పీ డా. శబరీష్ వివరించారు. సమాజ భద్రతలో పోలీసుల పాత్రను కళాత్మకంగా ఆవిష్కరించే ఈ సువర్ణావకాశాన్ని జిల్లాలోని ప్రతిభావంతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.