క్లాక్‌టవర్ జంక్షన్ అభివృద్ధి పనులను వరల్డ్ బ్యాంక్ బృందంతో కలిసి పరిశీలించిన – మేయర్
నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి
నల్గొండ నగర అభివృద్ధిలో భాగంగా ప్రతిపాదించిన క్లాక్‌టవర్ జంక్షన్ అభివృద్ధి ప్రాజెక్టును మేయర్ శ్రీమతి బుర్రి చైతన్య శ్రీనివాస్ రెడ్డి, డిప్యూటీ మేయర్ శ్రీ మహమ్మద్ అష్రఫ్ అలీ వరల్డ్ బ్యాంక్ బృందంతో కలిసి క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రతిపాదిత స్కైవాక్, కమర్షియల్ కాంప్లెక్స్, అర్బన్ ప్లాజా, రీచార్జ్ వెల్స్ తదితర అభివృద్ధి పనులపై చర్చించారు. నగర అభివృద్ధితో పాటు పర్యావరణ పరిరక్షణ, ప్రజల భద్రతకు ప్రాధాన్యత ఇవ్వాలని చర్చించారు. ప్రాజెక్టుకు సంబంధించిన పర్యావరణ అనుమతులు, భూ సంబంధిత అంశాలు, ప్రజల అభిప్రాయాల సేకరణ, నిర్మాణ సమయంలో తీసుకోవాల్సిన భద్రతా చర్యలు, ఫిర్యాదుల పరిష్కార విధానాలపై వరల్డ్ బ్యాంక్ బృందం పలు సూచనలు చేసింది.
ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ బి. వంశీకృష్ణ, మాజీ మున్సిపల్ చైర్‌పర్సన్ బుర్రి శ్రీనివాస్ రెడ్డి, మాజీ మున్సిపల్ వైస్ చైర్‌పర్సన్ అబ్బగోని రమేష్, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ బి. మనోహర, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పి. అశోక్ కుమార్, అసిస్టెంట్ ఇంజనీర్ వి. దిలీప్ భర్గవ, , మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

