ఘట్కేసర్, అక్టోబర్ 11 (ప్రజావాణి):ఘట్కేసర్ సర్కిల్ పరిధిలోని ఎంఎంసీ 6వ డివిజన్లో మాజీ మంత్రి, ఎమ్మెల్యే చామకూర మల్లారెడ్డి ఆదేశాల మేరకు మాజీ ఎంపీపీ బండారి శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో పట్టభద్రుల ఓటరు నమోదు ప్రక్రియను ప్రారంభించారు. అర్హులైన పట్టభద్రులు ఓటరుగా నమోదు చేసుకోవాలని ఈ సందర్భంగా నాయకులు సూచించారు.
ఈ కార్యక్రమంలో మేడ్చల్–మల్కాజిగిరి జిల్లా బీఆర్ఎస్ సోషల్ మీడియా వారియర్ ఎండీ సిరాజ్, నాయకులు బానుక నవీన్, వెంకటేశ్వర్లు చారి, చంద్రయ్య తదితరులు పాల్గొన్నారు.
