📄 ePaper
Epaper 2
Monday, October 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం

📰 Generate e-Paper Clip

పద్మశాలి సంఘం నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారం..

మన ప్రజావాణి జుక్కల్ ఆర్ సి ప్రతినిధి అక్టోబర్ 11

కామారెడ్డి జిల్లా పద్మశాలి సంఘం నూతన కార్యవర్గ సభ్యులు ఆదివారం కామారెడ్డి జిల్లా కేంద్రం లో జరిగిన కార్యక్రమం లో
తెలంగాణ రాష్ట్ర పద్మశాలి సంఘం అధ్యక్షులు వాళ్లకాటి రాజకుమార్, జిల్లా అధ్యక్షులు సిరిగధ లక్ష్మి నరసింలు సమక్షలో జిల్లా ఉపాధ్యక్షుడిగా మెరిగేవార్ శ్రీనివాస్, కార్యదర్శిగా రచ్చ కుశాల్, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా గజేంద్రవార
దేవిదాస్, కార్యవర్గ సభ్యుడిగా పోలా శశికాంత్ ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసి బాధ్యతలు చేపట్టారు.

ఈ సందర్భంగా నూతన కార్యవర్గ సభ్యులు సంఘ అభివృద్ధికి అంకితభావంతో పనిచేస్తామని తెలిపారు. పద్మశాలి సమాజంలో ఐక్యతను పెంపొందించడంతో పాటు సంఘాన్ని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేస్తామన్నారు. కులస్థుల సమస్యలను గుర్తించి వాటి పరిష్కారానికి తమ వంతు సహకారం అందిస్తామని పేర్కొన్నారు. సంఘం ఆధ్వర్యంలో నిర్వహించే సామాజిక సేవా కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొంటూ సమాజ అభ్యున్నతికి కృషి చేస్తామని తెలిపారు. నూతన బాధ్యతలను సమర్థవంతంగా నిర్వహిస్తూ సంఘానికి మంచి పేరు తీసుకువచ్చేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు.ఈ కార్యక్రమలో మద్నూర్ మండల అధ్యక్షులు ఉస్కేల్ వార్ శ్రీనివాస్, సంతోష్ అంబటివార్, కిషన్ శేఖర్ కోట తదితరులు వున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.