📄 ePaper
Epaper 2
Monday, October 12, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఘనంగా జనగామ జిల్లా దశాబ్ది ఉత్సవాలు

ఘనంగా జనగామ జిల్లా దశాబ్ది ఉత్సవాలు

📰 Generate e-Paper Clip

ఘనంగా జనగామ జిల్లా దశాబ్ది ఉత్సవాలు..
జిల్లా ఉద్యమకారులకు ఘన సన్మానం

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్,అక్టోబర్ 11(ప్రజావాణి): జనగామ జిల్లా ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాలను పురస్కరించుకుని ఆదివారం జనగామ జిల్లా జాక్ ఆధ్వర్యంలో స్థానిక విజయ ఫంక్షన్ హాల్‌లో వేడుకలు ఘనంగా నిర్వహించారు.

జనగామ జిల్లా జాక్ కన్వీనర్ మంగళంపల్లి రాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యమకారులు పాల్గొన్నారు.

ఈ కార్యక్రమానికి అతిథులుగా వైటిడిఏ సభ్యులు డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్, డాక్టర్ రాజమౌళి, డాక్టర్ సుగుణాకర్ రాజు, కల్నల్ డాక్టర్ బిక్షపతి, డాక్టర్ రంజిత్, కన్న పరిశరాములు, మెడ శ్రీనివాస్ తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఉద్యమకారులు పదేళ్ల జిల్లా సాధన ఉద్యమ జ్ఞాపకాలను గుర్తుచేసుకున్నారు.

జనగామ జిల్లా సాధన ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులపై నమోదైన కేసులను ప్రభుత్వం ఎత్తివేయాలని జాక్ కన్వీనర్ మంగళంపల్లి రాజు కోరారు. ఉద్యమకారులకు జనగామ జిల్లా జాక్ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. జిల్లా సాధన కోసం కృషి చేసిన ఉద్యమకారుల త్యాగాలు, పోరాటాలను గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.

ముఖ్య అతిథులు మాట్లాడుతూ రాబోయే రోజుల్లో జనగామ జిల్లా అభివృద్ధికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు. జిల్లా ఏర్పాటుకు ప్రత్యక్షంగా, పరోక్షంగా సహకరించిన ప్రతి ఒక్కరికీ, వివిధ సంఘాలు, సంస్థలకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేశారు.

అనంతరం జిల్లా సాధన ఉద్యమంలో పాల్గొన్న ఉద్యమకారులను పూలదండలు, శాలువాలు, జ్ఞాపికలతో ఘనంగా సత్కరించారు. జిల్లా ఉద్యమ స్ఫూర్తిని కొనసాగిస్తూ జనగామ జిల్లా అభివృద్ధికి సమిష్టిగా కృషి చేయాలని కార్యక్రమంలో పాల్గొన్నవారు ఆకాంక్షించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.