📄 ePaper
Epaper 2
Tuesday, October 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఉద్యమకారుల పోరాట ఫలితంగానే జనగామ జిల్లా ఆవిర్భావం

ఉద్యమకారుల పోరాట ఫలితంగానే జనగామ జిల్లా ఆవిర్భావం

📰 Generate e-Paper Clip

ఉద్యమకారుల పోరాట ఫలితంగానే జనగామ జిల్లా ఆవిర్భావం..

జిల్లా అభివృద్ధిపై స్థానిక ఎమ్మెల్యే ప్రత్యేక దృష్టి సారించాలి

జనగామ దశాబ్ది ఉత్సవాల్లో డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్ ఆవేదన – స్థానికేతరుల పాలన వల్లే వెనుకబాటు

జనగామ జిల్లా దశాబ్ది ఉత్సవాలు – ఉద్యమకారుల ఘన సన్మానం

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 11(ప్రజావాణి): జనగామ జిల్లా ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జనగామ పట్టణంలోని విజయ ఫంక్షన్ హాల్‌లో ఆదివారం నిర్వహించిన దశాబ్ది ఉత్సవాల్లో వైటీడీఏ మెంబర్ డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జనగామ జిల్లా సాధన కోసం ఆనాడు ఉద్యమించిన ఉద్యమకారులను ఘనంగా సన్మానించారు.

ఉద్యమకారుల త్యాగం మరువలేనిది – పదేళ్లైనా ఆశించిన అభివృద్ధి లేదు

ఈ సందర్భంగా డాక్టర్ లక్ష్మీ నారాయణ నాయక్ మాట్లాడుతూ, జనగామ జిల్లా అస్తిత్వం కోసం ఉద్యమకారులు చేసిన పోరాటాన్ని గుర్తుచేసుకుంటూ గర్వపడుతున్నామని అన్నారు. జిల్లా ఏర్పాటై పదేళ్లు గడిచినా ఆశించిన స్థాయిలో అభివృద్ధి జరగకపోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు.

జనగామ జిల్లా పేరు వార్తల్లో వినిపించినప్పుడు, ముఖ్యంగా ఏదైనా సంఘటన జరిగినపుడు మాత్రమే జిల్లా గురించి మాట్లాడుకునే పరిస్థితి ఉండటం దురదృష్టకరమని పేర్కొన్నారు.
జనగామ జిల్లా ఉద్యమ చరిత్రను గుర్తుచేస్తూ, జిల్లా ఏర్పాటు కోసం అనేక మంది ఉద్యమకారులు నిరంతరం పోరాటం చేశారని తెలిపారు. ఆనాటి జిల్లా పునర్వ్యవస్థీకరణ సమయంలో జనగామ నియోజకవర్గానికి సంబంధించిన ప్రాంతాలను సిద్ధిపేట జిల్లాలో కలపడంపై నెలకొన్న అభ్యంతరాలను ప్రస్తావించారు.

కేసీఆర్ కుటుంబ రాజకీయ ప్రయోజనాల కారణంగా జనగామ జిల్లాకు ప్రాధాన్యత కలిగిన తపాసుపల్లి రిజర్వాయర్, కొమురవెల్లి దేవస్థానం వంటి అంశాలు సిద్ధిపేట జిల్లాతో ముడిపడటంపై ఆవేదన వ్యక్తం చేశారు. హరీష్ రావు స్వార్థం వల్లనే చేర్యాల ప్రాంతానికి అన్యాయం జరుగుతుందని విమర్శించారు.

వరంగల్-హైదరాబాద్ మధ్య కీలకం జనగామ – స్థానిక ఎమ్మెల్యే చొరవ చూపాలి

హైదరాబాద్, హన్మకొండ తర్వాత మరింత అభివృద్ధి చెందాల్సిన ప్రాంతాల్లో జనగామ జిల్లా కూడా ఒకటని గుర్తుచేశారు. వరంగల్–హైదరాబాద్ మధ్య కీలక ప్రాంతంలో ఉన్న జనగామలో పారిశ్రామిక రంగం, ఉపాధి అవకాశాలు, రహదారులు, మౌలిక సదుపాయాలు, పట్టణాభివృద్ధి వంటి రంగాల్లో గణనీయమైన పురోగతి సాధించాల్సి ఉందని అన్నారు.

జనగామ ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి జిల్లా కేంద్రం అభివృద్ధిపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని డిమాండ్ చేశారు. ప్రజల ఓట్లతో గెలిచిన ప్రజాప్రతినిధులు వ్యక్తిగత, వ్యాపార ప్రయోజనాలకే పరిమితం కాకుండా ప్రజల సమస్యల పరిష్కారం, సంక్షేమం, ప్రాంత అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని కోరారు.

జనగామ జిల్లా సాధన కోసం ఉద్యమకారులు చేసిన పోరాటానికి నిజమైన గుర్తింపు లభించాలంటే జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందాలని, జనగామను అభివృద్ధి చెందిన జిల్లా కేంద్రంగా తీర్చిదిద్దేందుకు పాలకులు చిత్తశుద్ధితో కృషి చేయాలని పిలుపునిచ్చారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.