📄 ePaper
Epaper 2
Tuesday, October 13, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణదేవుని సేవకే పాస్టర్ జీవితం... ఆత్మల రక్షణే లక్ష్యం

దేవుని సేవకే పాస్టర్ జీవితం… ఆత్మల రక్షణే లక్ష్యం

📰 Generate e-Paper Clip

దేవుని సేవకే పాస్టర్ జీవితం… ఆత్మల రక్షణే లక్ష్యం.

పాస్టర్ డే సందర్భంగా సన్మానం

మాజీ సర్పంచ్, చర్చి నిర్మాణ కమిటీ కార్యదర్శి జీడికంటి సుదర్శన్

మద్దూరు అక్టోబర్11, ప్రజా వాణి,

ఆత్మల రక్షణే లక్ష్యంగా దేవుని సేవలోనే పాస్టర్ యొక్క జీవితం నిరంతరం కొనసాగుతుందని మండలంలోని లద్నూరు గ్రామ బేతనియ ప్రార్థన మందిరం పాస్టర్ టి.డేవిడ్ దంపతులను స్థానిక సంఘ పెద్దలు, సంగస్థులు శాలువ కప్పి ఘనంగా సన్మానించారు.ఈ సందర్భంగా మాజీ సర్పంచ్ సుదర్శన్, సంఘ నాయకుడు కొమ్ము భాస్కర్ మాట్లాడుతూ దేవుని సేవ చేయడం అంటే ఎంతో భారంతో కూడుకొని ఉందని కుటుంబాన్ని చూసుకుంటూ సంఘం యొక్క అభివృద్ధి దేవుని పట్ల ప్రతి కుటుంబం పట్ల రాత్రి పగలు కన్నీటి ప్రార్ధన చేస్తు సంఘస్తూల జీవితాలను దేవుని మార్గంలో నడిపేందుకు ఎంతో భారంతో పరిచర్య చేస్తు ఉంటారని అన్నారు.గతంలో సేవకులుగా పని చేసిన దామెర నాతాన్, జంగిటి ఇశ్రాయేలు పరిచర్యను గుర్తుచేశారు. అదే విధంగా పాస్టర్ డేవిడ్ 50 కిలో మీటర్ల దూరం నుండి లద్నూరు వరకు వచ్చి పరిచర్య అందించడం అభినందనీయమన్నారు. ద్విచక్ర వాహనంపై రాత్రి పూట గృహ కూడికలకు, కుటుంబాల్లో జరుగుతున్న ప్రత్యేక కార్యక్రమాలకు వచ్చే సమయంలో రోడ్డుపై ఎన్నో ప్రమాదాలు పొంచి ఉన్న దేవుని పరిచర్యను ముందుకు తీసుకెళ్లడమే ద్యేయంగా పని చేయడం ఎంతో గొప్పదని ఆయన సేవలను కొనియాడారు. రానున్న రోజుల్లో దేవుడు మంచి ఆరోగ్యంతో ఉండి డేవిడ్ పాస్టర్ దంపతులు ఎంతో అద్భుతమైన పరిచర్య అందించాలని కోరుకున్నారు.ఈ కార్యక్రమంలో సంఘ నాయకులు, సంఘస్తూలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.