పుదిపట్ల స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో నేత్రపర్వంగా గాయత్రీ దేవి అలంకరణ
మన ప్రజావాణి
చౌడేపల్లి అక్టోబర్ 12
అన్నమయ్య జిల్లా చౌడేపల్లి మండలం పుదిపట్ల గ్రామంలో వెలసిన స్వయంభు శ్రీ వైష్ణవి దేవి ఆలయంలో దసరా నవరాత్రుల వేడుకలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఉత్సవాలలో భాగంగా రెండవ రోజైన సోమవారం అమ్మవారు శ్రీ గాయత్రీ దేవి అలంకారంలో భక్తులకు అభయమిచ్చారు.
ఉత్సవాల్లో భాగంగా ఉదయమే ఆలయ అర్చకరాలు శ్రావణి అమ్మవారికి అత్యంత భక్తిశ్రద్ధలతో పంచామృత అభిషేకం నిర్వహించారు. అనంతరం అమ్మవారిని సకల ఆభరణాలు, విశేష పుష్మాలతో గాయత్రీ దేవి రూపంలో సుందరంగా అలంకరించారు.
ఈ దివ్యదర్శనం కోసం చౌడేపల్లి చుట్టుపక్కల గ్రామాలతో పాటు బెంగళూరు, మదనపల్లి, పుంగనూరు తదితర ప్రాంతాల నుండి భక్తులు భారీ సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. అమ్మవారి కృపకు పాత్రులై ప్రత్యేక పూజలు నిర్వహించారు.
నేటి ఉభయదారులుగా లబ్ధిగం గ్రామానికి చెందిన పచ్చిరాల కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఆలయ ధర్మకర్త వినోద్ కుమార్ ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేసి, అమ్మవారి తీర్థప్రసాదాలను అందజేశారు. దసరా శరన్నవరాత్రుల సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తుల నామస్మరణతో మార్మోగింది.

