📄 ePaper
Epaper 2
Tuesday, October 13, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNizamabadహెగ్డోల్లీలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు.

హెగ్డోల్లీలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు.

📰 Generate e-Paper Clip

హెగ్డోల్లీలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు.

మొదటి రోజు శ్రీ బాలా త్రిపురసుందరీ దేవిగా అమ్మవారి దర్శనం.

12 మంది భక్తుల మాలధారణ.

కోటగిరి/ప్రజావాణి:-పోతంగల్ మండల పరిధిలోని హెగ్డోల్లీ గ్రామంలో శ్రీ సార్వజనిక దేవి దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 3వ ఏట దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.ఉత్సవాల తొలిరోజైన ఆదివారం నాడు గ్రామంలోని ప్రధాన కూడళ్ల గుండా అమ్మవారి ఆగమన శోభాయాత్రను కన్నుల పండువగా నిర్వహించారు.మంగళవాయిద్యాలు,భజన కీర్తనలు,భక్తుల జయజయధ్వనుల నడుమ అమ్మవారి విగ్రహాన్ని ఊరేగించి,ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉత్సవ పందిరిలో శాస్త్రోక్తంగా ప్రతిష్ఠించారు.ఈ సందర్భంగా 12 మంది భక్తులు నియమనిష్టలతో అమ్మవారి మాలధారణ ధరించారు.నవరాత్రి ఉత్సవాల తొలిరోజున అమ్మవారు శ్రీ బాలా త్రిపురసుందరీ దేవి అవతారంలో భక్తులకు దర్శనమిచ్చారు.ఈ కార్యక్రమంలో గ్రామ పెద్దలు, మహిళలు,యువకులు,ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొని అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్సవాల సందర్భంగా ప్రతిరోజూ అమ్మవారికి ప్రత్యేక అలంకారాలు,పూజలు,సాంస్కృతిక,భక్తి కార్యక్రమాలు కొనసాగుతాయని ఉత్సవ కమిటీ సభ్యులు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.