*అహంతో ఎదిగేవాడు తొక్కుతాడు..ఆత్మ విశ్వాసంతో ఎదిగేవాడు చేయుతనిస్తాడు*
.ఇదే ప్రజావాణి శ్రీకాంత్ మనకు చెప్పిన జీవిత పాఠం..గుండెల్లో దాచుకోవాల్సిన నిజం.
*ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్ (ప్రజావాణి )*:-
శ్రీకాంత్ రాసిన ఒక్కో అక్షరం నిజం. ఇది మనిషి జీవితానికి అద్దం పడుతుంది.
అహంకారంతో ఎదిగినవాడు ఎప్పుడూ తన కింద అందరూ ఉండాలని కోరుకుంటాడు. వాడు ఎదగడం కాదు, ఇతరులను తొక్కడం.
అలాంటి వాడు డబ్బు వస్తే మనిషిని మర్చిపోతాడు. పదవి వస్తే పుట్టిన ఊరినే మర్చిపోతాడు. వాడికి అందరూ తక్కువే.
కానీ ఆత్మవిశ్వాసంతో ఎదిగినవాడు అలా కాదు.వాడు ఒక్కడే పైకి వెళ్లాలని అనుకోడు
వాడు తనతో పాటు పది మందిని పైకి తీసుకెళ్లాలని అనుకుంటాడు. వాడే నిజమైన మనిషి. వాడే మన బిడ్డ.
మనం చూస్తున్నాం. కొందరు కొద్దిగా డబ్బు రాగానే కళ్లు నెత్తికెక్కుతాయి. పక్కన ఉన్న పేదోడిని కూడా మనిషిగా చూడరు.
కానీ కొందరు ఉన్నారు. కష్టం తెలిసినోళ్లు. ఆకలి తెలిసినోళ్లు. వాళ్లు ఎప్పటికీ ఆకలితో ఉన్నోడి కడుపు నింపాలని చూస్తారు.
ఆస్తులు ఉన్నవాడు రోజూ లెక్కలు వేస్తాడు. నేను ఎంత సంపాదించాను, నా బ్యాంకులో ఎంత ఉంది అని.కానీ ఆకలి తెలిసి ఎదిగినవాడు వేరే లెక్కలు వేస్తాడు. నేను ఎంతమందికి సాయం చేశాను, ఎంతమంది కడుపు నింపాను అని
మనిషికి మనిషికి తేడా అహంకారం ఉన్నోడి ఇల్లు పెద్దగా ఉంటుంది. కానీ గుండె మాత్రం చిన్నగా ఉంటుంది.
ఆత్మవిశ్వాసం ఉన్నోడి ఇల్లు చిన్నగా ఉన్నా, వాడి గుండె మాత్రం గుడి అంత పెద్దగా ఉండాలి.అందరినీ కలుపుకుని పోయే మనుషులు కావాలి.
తొక్కుకుంటూ పైకి వెళ్లేవాడు ఎక్కువ కాలం పైనుండడు. కానీ అందరినీ పైకి తీసుకెళ్లేవాడు దేవుడిలా గుర్తుండిపోతాడు.
ఈ రోజుల్లో డబ్బు, హోదా వస్తే చాలు, మనిషి మారిపోతున్నాడు. బంధాలను, స్నేహాలను, మానవత్వాన్ని మర్చిపోతున్నాడు.
కానీ గుర్తుంచుకోండి. చివరికి మిగిలేది డబ్బు కాదు. మనం చేసిన మంచి పనులు. మనం సంపాదించిన మనుషుల ప్రేమ.ఒక పూట ఆకలితో ఉన్నోడికి అన్నం పెడితే వచ్చే తృప్తి, కోటి రూపాయల్లో కూడా రాదు. ఇది ఆకలి తెలిసినోడికే తెలుస్తుంది.
అహంకారంతో మాట్లాడితే నలుగురు దూరం అవుతారు. ఆత్మవిశ్వాసంతో ప్రేమగా మాట్లాడితే నలుగురు దగ్గర అవుతారు.
జీవితంలో ఎదగడం తప్పు కాదు. కానీ ఎదిగేటప్పుడు ఇతరులను తొక్కుతూ ఎదగకూడదు.
నిజంగా ఎదగడం అంటే నువ్వు ఎదుగుతూ, నీతో పాటు నీ ఊరిని, నీ వాళ్లను కూడా ఎదిగించడం.
ప్రతి మాట మన యువతకు ఒక పాఠం. అహంకారాన్ని వదిలేయండి. ఆత్మవిశ్వాసాన్ని పెంచుకోండి.
ఆస్తులు శాశ్వతం కాదు. కానీ నువ్వు చేసిన సహాయం శాశ్వతం. నీ పేరును బతికిస్తుంది.
యువత ఇది గుర్తుంచుకోవాలి. డబ్బుతో కాదు, మంచి మనసుతో పెద్దవారు కావాలి.
అందరినీ కింద ఉంచాలనుకునేవాడు ఎప్పటికీ నాయకుడు కాలేడు. అందరినీ పైకి తీసుకెళ్లేవాడే నిజమైన నాయకుడు.
ఆకలి విలువ తెలిసినవాడు ఎప్పుడూ అన్నం వృథా చేయడు. ఆకలితో ఉన్నవాడి విలువ వాడికే తెలుస్తుంది.
కాబట్టి మనం కూడా అలాంటి మనిషిగా బతుకుదాం. అహంకారాన్ని పక్కన పెట్టి, మానవత్వాన్ని దగ్గరకు తీసుకుందాం.
ఈ మాటలు కేవలం రాతలు కావు. ఇవి బతుకును మార్చే సూత్రాలు. గుండెల్లో పెట్టుకోవాల్సిన నిజాలు.

