హెగ్డోల్లీలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు.

హెగ్డోల్లీలో వైభవంగా ప్రారంభమైన దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు. మొదటి రోజు శ్రీ బాలా త్రిపురసుందరీ దేవిగా అమ్మవారి దర్శనం. 12 మంది భక్తుల మాలధారణ. కోటగిరి/ప్రజావాణి:-పోతంగల్ మండల పరిధిలోని హెగ్డోల్లీ గ్రామంలో శ్రీ సార్వజనిక దేవి దుర్గామాత ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో 3వ ఏట దేవి శరన్నవరాత్రి ఉత్సవాలు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి.ఉత్సవాల తొలిరోజైన ఆదివారం నాడు గ్రామంలోని ప్రధాన కూడళ్ల గుండా అమ్మవారి ఆగమన శోభాయాత్రను కన్నుల పండువగా నిర్వహించారు.మంగళవాయిద్యాలు,భజన కీర్తనలు,భక్తుల జయజయధ్వనుల నడుమ అమ్మవారి విగ్రహాన్ని ఊరేగించి,ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ఉత్సవ...