📄 ePaper
Epaper 2
Saturday, October 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణబీహెచ్‌ఈఎల్ డిపోలో టీడబ్ల్యూయూ విజయదుందుభి

బీహెచ్‌ఈఎల్ డిపోలో టీడబ్ల్యూయూ విజయదుందుభి

📰 Generate e-Paper Clip

*బీహెచ్‌ఈఎల్ డిపోలో టీడబ్ల్యూయూ విజయదుందుభి!*

*289 ఓట్లలో 174 ఓట్లతో ఆధిక్యం.. పుష్ప నాగేష్ ఆధ్వర్యంలో విజయోత్సవ ర్యాలీ*

రామచంద్రాపురం, అక్టోబర్ 9 (ప్రజావాణి): ఆర్టీసీ కార్మిక సంఘం ఎన్నికల్లో బీహెచ్‌ఈఎల్ డిపోలో టీడబ్ల్యూయూ సత్తా చాటుకుంది. రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం నిర్వహించిన ఎన్నికల్లో భాగంగా బీహెచ్‌ఈఎల్ డిపోలో బాణం గుర్తుతో పోటీ చేసిన టీడబ్ల్యూయూ అత్యధికంగా 174 ఓట్లు సాధించి ఆధిక్యంలో నిలిచింది. మొత్తం 325 ఓట్లకు గాను 289 ఓట్లు పోలవగా, తొమ్మిది మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ప్రధానంగా మూడు కార్మిక సంఘాల మధ్య పోటీ నెలకొంది. గద గుర్తుతో పోటీ చేసిన టీజేఎంయూకు 74 ఓట్లు, టీఎస్‌ఆర్టీసీ ఎంప్లాయిస్ యూనియన్‌కు 40 ఓట్లు లభించినట్లు ఎన్నికల అధికారి మహమ్మద్ అఫ్జల్ పాషా వెల్లడించారు.
బీహెచ్‌ఈఎల్ డిపోలో పోలింగ్ ప్రక్రియ ప్రశాంతంగా కొనసాగింది. సాధారణ ఎన్నికలను తలపించేలా కార్మికులు తమ ఓటు హక్కును వినియోగించుకోగా, ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటుచేసుకోకుండా పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. రామచంద్రాపురం ఏసీపీ శ్రీనివాస్ కుమార్ పోలింగ్ కేంద్రాన్ని సందర్శించి పరిస్థితిని సమీక్షించారు.
రాష్ట్రస్థాయిలోనూ టీడబ్ల్యూయూకు ఆధిక్యం లభించినట్లు సంఘం వర్గాలు తెలిపాయి. బీహెచ్‌ఈఎల్ డిపోలో సాధించిన ఆధిక్యంతో సంఘం నాయకులు, కార్యకర్తల్లో ఉత్సాహం నెలకొంది. ఈ నేపథ్యంలో సంఘం గౌరవ అధ్యక్షుడు పుష్ప నాగేష్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు విజయోత్సవ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎన్నికల్లో మద్దతు తెలిపిన కార్మికులకు కృతజ్ఞతలు తెలిపారు. కార్మికుల మద్దతుతో సంఘం మరింత బలోపేతమైందని నాయకులు ఆనందం వ్యక్తం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.