📄 ePaper
Epaper 2
Saturday, October 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణజాతీయ వేదికపై నేరడిగుంట పేరు

జాతీయ వేదికపై నేరడిగుంట పేరు

📰 Generate e-Paper Clip

*జాతీయ వేదికపై నేరడిగుంట పేరు*

• యువ సర్పంచ్ సాయికిరణ్ ఆలోచనలకు ఐఏఎస్ అధికారి ప్రశంసలు

• దేశవ్యాప్తంగా ఎంపికైన 17 మంది సర్పంచ్‌లలో తెలంగాణ నుంచి నేరడిగుంటకు అవకాశం

మన సమగ్ర ప్రజావాణి ఆందోల్, అక్టోబర్ 10: జిల్లా ప్రతినిధి

సంగారెడ్డి జిల్లా ఆందోల్ మండలం నేరడిగుంట గ్రామానికి జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. దేశవ్యాప్తంగా ఎంపికైన 17 మంది సర్పంచ్‌లలో తెలంగాణ నుంచి నేరడిగుంట గ్రామ సర్పంచ్ వొగ్గు సాయికిరణ్ యాదవ్‌కు అవకాశం దక్కడం విశేషం.
కేంద్ర జలశక్తి మంత్రిత్వ శాఖ పరిధిలోని తాగునీరు, పారిశుద్ధ్య విభాగం ( డి డి డబ్ల్యు ఎస్ ) నిర్వహించిన జాతీయ స్థాయి సర్పంచ్ సంవాద్ కార్యక్రమంలో సాయికిరణ్ పాల్గొని గ్రామాభివృద్ధి, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజల భాగస్వామ్యంపై తన ఆలోచనలను పంచుకున్నారు.
సాయికిరణ్ ఆలోచనలకు ఐఏఎస్ అధికారి ప్రశంసలు
ఈ కార్యక్రమంలో స్వచ్ఛ భారత్ మిషన్ జాయింట్ సెక్రటరీ, మిషన్ డైరెక్టర్ ఐఏఎస్ అధికారి ఐశ్వర్య సింగ్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా సర్పంచ్ సాయికిరణ్ వివరించిన అంశాలను ప్రస్తావిస్తూ ఆమె ప్రశంసలు కురిపించారు.
సర్పంచ్, పారిశుధ్య కార్మికులు, గ్రామ ప్రజలు సమన్వయంతో పనిచేస్తేనే గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్దడం సాధ్యమవుతుందని సాయికిరణ్ వివరించారు. గ్రామాభివృద్ధిలో ప్రతి ఒక్కరి భాగస్వామ్యం అవసరమని ఆయన పేర్కొన్నారు.
ఈ ఆలోచనలను అభినందించిన ఐఏఎస్ అధికారి ఐశ్వర్య సింగ్ “అదే ఈ కార్యక్రమంలోని గొప్పదనం.. అదే ఈ కార్యక్రమానికి బలం.”అంటూ ప్రశంసించారు. గ్రామస్థాయిలో వ్యక్తమైన ఆలోచన జాతీయ వేదికపై ప్రస్తావనకు రావడంతో నేరడిగుంట గ్రామానికి ప్రత్యేక గుర్తింపు లభించింది.
ఆదర్శ గ్రామంగా తీర్చిదిద్దడమే లక్ష్యం
జాతీయ స్థాయిలో లభించిన ఈ ప్రశంస తన ఒక్కడికే పరిమితం కాదని, గ్రామ ప్రజలు, పారిశుధ్య కార్మికులు, గ్రామాభివృద్ధికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరికీ చెందుతుందని సర్పంచ్ వొగ్గు సాయికిరణ్ యాదవ్ తెలిపారు.
ప్రజల భాగస్వామ్యంతో నేరడిగుంట గ్రామాన్ని మరింత పరిశుభ్రంగా, ఆరోగ్యకరంగా తీర్చిదిద్ది ఆదర్శ గ్రామంగా అభివృద్ధి చేయడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు.
దేశవ్యాప్తంగా ఎంపికైన సర్పంచ్‌లతో కలిసి జాతీయ స్థాయి కార్యక్రమంలో పాల్గొనడం, తన ఆలోచనలకు ఉన్నతాధికారి ప్రశంసలు లభించడం నేరడిగుంట గ్రామ ప్రజల్లో ఆనందాన్ని నింపింది. గ్రామాభివృద్ధికి సమష్టి కృషి ఎంత ముఖ్యమో ఈ కార్యక్రమం మరోసారి చాటిచెప్పింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.