📄 ePaper
Epaper 2
Saturday, October 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణమండల ప్రత్యేక అధికారి పి. కిషన్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం

మండల ప్రత్యేక అధికారి పి. కిషన్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం

📰 Generate e-Paper Clip

*మండల ప్రత్యేక అధికారి పి. కిషన్ ఆధ్వర్యంలో సమీక్ష సమావేశం*

మన సమగ్ర ప్రజావాణి అక్టోబర్ 10(జోగిపేట) జిల్లా ప్రతినిధి

ప్రభుత్వ పథకాల అమలుపై సమీక్ష.. నీటి సంరక్షణ పనులను వేగవంతం చేయాలి
మండలంలోని అన్ని గ్రామాల సర్పంచులు, శాఖల ప్రత్యేక అధికారులకు సూచనలు
మండల ప్రత్యేక అధికారి పి. కిషన్ ఆధ్వర్యంలో శుక్రవారం నాడు గ్రామ పంచాయతీల సర్పంచులు, వివిధ శాఖల ప్రత్యేక అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఆయా శాఖల అధికారులు తమ ప్రగతి నివేదికలను వివరించగా, సర్పంచులు అడిగిన సందేహాలను అధికారులు నివృత్తి చేశారు.
రైతులు క్రాప్ బుకింగ్ చేసుకోవాలి
ఈ సందర్భంగా వ్యవసాయ శాఖ అధికారి మాట్లాడుతూ మండలంలోని రైతులందరూ క్రాప్ బుకింగ్ చేసుకోవాలని సూచించారు. రైతుల సంక్షేమం కోసం ప్రభుత్వం అమలు చేస్తున్న వివిధ పథకాలు, కార్యక్రమాల గురించి వివరించారు.
నీటి సంరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలి
వీబీ-జీ-రామ్-జీ పథకంలో భాగంగా జలసిరి కార్యక్రమం ద్వారా అన్ని గ్రామ పంచాయతీల్లో ఇంటింటికీ ఇంకుడు గుంతలు, బోర్‌వెల్ రీఛార్జ్ నిర్మాణాలు, డ్రెయిన్ ఎండ్ సోక్‌పిట్ల నిర్మాణాలు చేపట్టాలని అధికారులు సూచించారు. వర్షపు నీటిని సంరక్షించి భూగర్భ జలాలను పెంపొందించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని తెలిపారు.
గ్రామాల సమస్యలను పరిష్కరించాలి
సమావేశంలో కోడెకల్ సర్పంచ్ మిషన్ భగీరథ ద్వారా గ్రామానికి సరిపడా తాగునీటిని సరఫరా చేయాలని కోరారు. చింతకుంట, పోతిరెడ్డిపల్లి సర్పంచులు మహిళా సమాఖ్య భవనాలకు సంబంధించిన భూ సమస్యలను త్వరగా పరిష్కరించాలని అధికారులను కోరారు.
అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి
మండల ప్రత్యేక అధికారి పి. కిషన్ మాట్లాడుతూ గ్రామాల్లో ఫామ్ పాండ్స్, ఇంకుడు గుంతలు, అంగన్‌వాడీ మరుగుదొడ్ల నిర్మాణాలను వేగవంతం చేయాలని సూచించారు. ప్రభుత్వం నిర్దేశించిన ప్రాధాన్యతలకు అనుగుణంగా అభివృద్ధి పనులను పూర్తి చేయాలని తెలిపారు. ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలను లబ్ధిదారులు త్వరితగతిన పూర్తి చేసుకునేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.
అలాగే అన్ని గ్రామాల్లో అర్హులైన వారికి నూతన పింఛన్లు అందేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఎల్‌నినో ప్రభావంతో ఏర్పడే వాతావరణ పరిస్థితులను ఎదుర్కొనేందుకు అధికారులు, ప్రజాప్రతినిధులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు.
ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై గ్రామ ప్రజలకు అవగాహన కల్పించి, అభివృద్ధి కార్యక్రమాల్లో ప్రజలందరూ ఉత్సాహంగా పాల్గొనేలా చూడాలని సమావేశంలో సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.