📄 ePaper
Epaper 2
Saturday, October 10, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణనూతన హైమాస్ట్ లైట్లు 9వ వార్డులో ఏర్పాటు

నూతన హైమాస్ట్ లైట్లు 9వ వార్డులో ఏర్పాటు

📰 Generate e-Paper Clip

నూతన హైమాస్ట్ లైట్లు 9వ వార్డులో ఏర్పాటు!

.కాలనీల్లో వెలుగులు నింపిన కౌన్సిలర్ బాణపురం రాజు ముదిరాజ్..

నారాయణఖేడ్, అక్టోబర్ 9 (ప్రజావాణి):
బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా నారాయణఖేడ్ పట్టణంలోని 9వ వార్డులో పండుగ వెలుగులు నింపేలా నూతన హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేశారు. సాయినగర్, వివేకానంద కాలనీ, బుడగ జంగం కాలనీలలో ప్రజలకు మెరుగైన వెలుతురు అందించాలనే ఉద్దేశంతో 9వ వార్డు కౌన్సిలర్ బాణపురం రాజు ముదిరాజ్ ఈ లైట్లను ఏర్పాటు చేయించారు.ఎంపీ, ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఆదేశాల మేరకు వార్డులో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు.పండుగల వేళ కాలనీలలో వెలుతురు పెరగడంతో పాటు, రాత్రి సమయాల్లో ప్రజల రాకపోకలకు సౌకర్యంగా ఉంటుందని స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు.ప్రజలకు అవసరమైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు కౌన్సిలర్ చేస్తున్న కృషిపై కాలనీవాసులు హర్షం వ్యక్తం చేశారు.పండుగల సందర్భంగా తమ కాలనీలలో నూతన హైమాస్ట్ లైట్లు ఏర్పాటు చేయించిన కౌన్సిలర్ బాణపురం రాజు ముదిరాజ్‌కు కాలనీవాసులు ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.ఈ కార్యక్రమంలో కాలనీవాసులు ఏసు రెడ్డి, రజనీకాంత్, లక్ష్మీనారాయణ, దుర్గయ్య, అనిల్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.