నూతన హైమాస్ట్ లైట్లు 9వ వార్డులో ఏర్పాటు
నూతన హైమాస్ట్ లైట్లు 9వ వార్డులో ఏర్పాటు! .కాలనీల్లో వెలుగులు నింపిన కౌన్సిలర్ బాణపురం రాజు ముదిరాజ్.. నారాయణఖేడ్, అక్టోబర్ 9 (ప్రజావాణి): బతుకమ్మ, దసరా పండుగల సందర్భంగా నారాయణఖేడ్ పట్టణంలోని 9వ వార్డులో పండుగ వెలుగులు నింపేలా నూతన హైమాస్ట్ లైట్లను ఏర్పాటు చేశారు. సాయినగర్, వివేకానంద కాలనీ, బుడగ జంగం కాలనీలలో ప్రజలకు మెరుగైన వెలుతురు అందించాలనే ఉద్దేశంతో 9వ వార్డు కౌన్సిలర్ బాణపురం రాజు ముదిరాజ్ ఈ లైట్లను ఏర్పాటు చేయించారు.ఎంపీ, ఎమ్మెల్యే, మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్‌ల ఆదేశాల...