📄 ePaper
Epaper 2
Saturday, October 10, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణJagtialకొత్తపేటలో బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

కొత్తపేటలో బాధితులను పరామర్శించిన మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్

📰 Generate e-Paper Clip

జగిత్యాల స్టాఫ్ రిపోర్టర్, ఎండపల్లి అక్టోబర్ 09(ప్రజావాణి):

జగిత్యాల జిల్లా ఎండపల్లి మండలం కొత్తపేట గ్రామంలో శోకసంద్రంలో ఉన్న పలు కుటుంబాలను శుక్రవారం రోజున మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ పరామర్శించారు. ఇటీవల ప్రమాదవశాత్తూ విద్యుత్ షాక్‌తో మృతి చెందిన కొప్పుల శేఖర్ కుటుంబ సభ్యులను కలిసిన ఆయన, వారికి తన ప్రగాఢ సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా బాధితులకు ఆర్థిక సహాయం అందజేసి భరోసానిచ్చారు. అనంతరం అదే గ్రామానికి చెందిన బీజేపీ ఎండపల్లి మండల అధ్యక్షుడు రావు హన్మంతరావు తండ్రి నారాయణ రావు ఇటీవలే స్వర్గస్తులు కాగా, విషయం తెలుసుకుని వారి నివాసానికి వెళ్లి నారాయణ రావు చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. శోకసంద్రంలో ఉన్న హన్మంతరావును, ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. ఈ కష్ట సమయంలో ఆ కుటుంబానికి భగవంతుడు మనోధైర్యాన్ని ప్రసాదించాలని, నారాయణ రావు ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. ఈ పరామర్శలో ఈశ్వర్ వెంట నాయకులు ఉపసర్పంచ్ లు మెరుగు జానీ, క్రాంతి చారి, శానబండ సర్పంచ్ గాదం భాస్కర్ పార్టీ నాయకులు, గాజుల మల్లేశం, పడిదం వెంకటేష్, రాజేశం కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.