📄 ePaper
Epaper 2
Sunday, October 11, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణపత్తిపాకలో ఘనంగా బొడ్డెమ్మ నిమజ్జనం

పత్తిపాకలో ఘనంగా బొడ్డెమ్మ నిమజ్జనం

📰 Generate e-Paper Clip

పత్తిపాకలో ఘనంగా బొడ్డెమ్మ నిమజ్జనం

శాయంపేట: మండలంలోని పత్తిపాక గ్రామంలో రెడ్డి సంఘం మహిళా సంఘం ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల పాటు బొడ్డెమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతిరోజూ మహిళలు భక్తిశ్రద్ధలతో బొడ్డెమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ, సంప్రదాయబద్ధంగా వేడుకల్లో పాల్గొన్నారు.

తొమ్మిది రోజుల వేడుకలు ముగియడంతో శుక్రవారం గ్రామంలోని ఐజల్ వాటర్ ప్లాంట్ సమీపంలో బొడ్డెమ్మ నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బొడ్డెమ్మకు ప్రత్యేక పూజలు చేసి, మేళతాళాల నడుమ నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు.

ఈ సందర్భంగా గ్రామంలో పండుగ వాతావరణం నెలకొంది. మహిళలు సంప్రదాయ దుస్తుల్లో పాల్గొని, భక్తిశ్రద్ధలతో బొడ్డెమ్మకు వీడ్కోలు పలికారు. గ్రామీణ సంప్రదాయాలు, ఆచారాలను కాపాడుతూ వేడుకలను ఐకమత్యంతో నిర్వహించడం విశేషంగా నిలిచింది.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.