పత్తిపాకలో ఘనంగా బొడ్డెమ్మ నిమజ్జనం

పత్తిపాకలో ఘనంగా బొడ్డెమ్మ నిమజ్జనం శాయంపేట: మండలంలోని పత్తిపాక గ్రామంలో రెడ్డి సంఘం మహిళా సంఘం ఆధ్వర్యంలో తొమ్మిది రోజుల పాటు బొడ్డెమ్మ వేడుకలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రతిరోజూ మహిళలు భక్తిశ్రద్ధలతో బొడ్డెమ్మకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తూ, సంప్రదాయబద్ధంగా వేడుకల్లో పాల్గొన్నారు. తొమ్మిది రోజుల వేడుకలు ముగియడంతో శుక్రవారం గ్రామంలోని ఐజల్ వాటర్ ప్లాంట్ సమీపంలో బొడ్డెమ్మ నిమజ్జన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని బొడ్డెమ్మకు ప్రత్యేక పూజలు చేసి, మేళతాళాల నడుమ నిమజ్జన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ...