*జడ్పీహెచ్ఎస్ అల్లీపూర్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు*
*రాయికల్, అక్టోబర్ 09 (ప్రజావాణి):*
రాయికల్ మండలంలోని అల్లీపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా, కోలాహలంగా జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగను పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు.పాఠశాల ఆవరణలో విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. అనంతరం విద్యార్థినులు, ఉపాధ్యాయినులు కలిసి బతుకమ్మల చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ, సాంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ సందడి చేశారు. చిన్నారుల పాటలు, ఆటలతో పాఠశాల ఆవరణమంతా పండుగ శోభను సంతరించుకుంది.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయులు కిరణ్ మాట్లాడుతూ తెలంగాణ సంస్కృతిలో పూలను పూజించే గొప్ప పండుగ బతుకమ్మ అని పేర్కొన్నారు. ప్రకృతిని ప్రేమిస్తూ, చెట్లను, పూలను కాపాడుకోవాలనే గొప్ప సందేశాన్ని ఈ పండుగ మనకు అందిస్తుందని తెలిపారు. ఇలాంటి పండుగల ద్వారా విద్యార్థుల్లో మన సంస్కృతి, సంప్రదాయాల పట్ల అవగాహన పెరుగుతుందని అన్నారు.ఈ వేడుకల్లో ఉపాధ్యాయులు శ్రీనివాస్,రాజేందర్, వసంతరావు,లక్ష్మి, రవికుమార్, రాజశేఖర్ రెడ్డి, రతిలాల్, మహేష్, రజిత, ఆనంద్, రాజన్న, జీవన్ రెడ్డి, బాలమురళి, శంకరయ్య, కృష్ణప్రసాద్,మల్లారెడ్డి తదితరులు పాల్గొని విద్యార్థులకు శుభాకాంక్షలు తెలియజేశారు.

