గూడెం ఎంపీపీఎస్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
విద్యార్థులకు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలపై అవగాహన
బెజ్జంకి, అక్టోబర్ 9 (ప్రజావాణి)
సిద్దిపేట జిల్లా బెజ్జంకి మండల పరిధిలోని గూడెం గ్రామంలోని ఎంపీపీఎస్ పాఠశాలలో బతుకమ్మ వేడుకలను విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల సమక్షంలో ఆనందోత్సాహాల మధ్య ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగావిద్యార్థులు,ఉపాధ్యాయులు బతుకమ్మ పండుగ విశిష్టతను తెలియజేస్తూ వేడుకల్లో ఉత్సాహంగా పాల్గొన్నారు.
తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను చిన్నారులకు పరిచయం చేయడంతో పాటు, మన సంప్రదాయాల గొప్పతనాన్ని భావితరాలకు అందించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్నినిర్వహించారు.పూలతో బతుకమ్మలను అలంకరించి పండుగ వాతావరణాన్ని నెలకొల్పారు.ఇలాంటి కార్యక్రమాల ద్వారా విద్యార్థుల్లో సాంస్కృతిక విలువలు, సంప్రదాయాల పట్ల గౌరవం పెంపొందుతుందని నిర్వాహకులు పేర్కొన్నారు.

