జడ్పీహెచ్ఎస్ అల్లీపూర్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు
*జడ్పీహెచ్ఎస్ అల్లీపూర్ పాఠశాలలో ఘనంగా బతుకమ్మ వేడుకలు* *రాయికల్, అక్టోబర్ 09 (ప్రజావాణి):* రాయికల్ మండలంలోని అల్లీపూర్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో బతుకమ్మ వేడుకలు అత్యంత వైభవంగా, కోలాహలంగా జరుపుకున్నారు. తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే ఈ పండుగను పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థినులు ఎంతో ఉత్సాహంగా జరుపుకున్నారు.పాఠశాల ఆవరణలో విద్యార్థినులు రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చారు. అనంతరం విద్యార్థినులు, ఉపాధ్యాయినులు కలిసి బతుకమ్మల చుట్టూ చేరి చప్పట్లు కొడుతూ, సాంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ, కోలాటాలు ఆడుతూ సందడి చేశారు....