📄 ePaper
Epaper 2
Monday, October 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMancherialఇంటి కల తీరుస్తున్న 'సుందిళ్ల' దంపతులు

ఇంటి కల తీరుస్తున్న ‘సుందిళ్ల’ దంపతులు

📰 Generate e-Paper Clip

ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సొంత నిధులతో ఆర్థిక

సాయం 20 మంది నిరుపేదలకు కొండంత అండగా సర్పంచ్‌ దంపతులు

జైపూర్, అక్టోబర్ 9, ప్రజావాణి:

ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా.. ఆర్థిక స్తోమత లేక ఇల్లు నిర్మించుకోలేకపోతున్న నిరుపేద కుటుంబాలకు స్థానిక సర్పంచ్‌ దంపతులు కొండంత అండగా నిలిచారు. గ్రామ పంచాయతీ పరిధిలోని 20 మంది అర్హులైన నిరుపేదలకు సొంత ఖర్చులతో ఆర్థిక సహాయం అందిస్తూ, ఇళ్లు పూర్తయ్యే వరకు బాధ్యత తీసుకుని తమ ఉదారతను చాటుకుంటున్నారు.గ్రామానికి చెందిన జనగామ శారద, సుందిళ్ల రాజమ్మ, జనగామ అనసూర్య, ఉల్లెందుల లచ్చయ్య, జనంపల్లి మల్లీశ్వరితో పాటు మొత్తం 20 మంది నిరుపేదలకు ప్రభుత్వం నుంచి ఇందిరమ్మ ఇళ్లు మంజూరయ్యాయి. అయితే, చేతిలో చిల్లిగవ్వ లేక, ముందస్తు నిర్మాణ వ్యయాన్ని భరించే శక్తి లేకపోవడంతో లబ్ధిదారులు ఇళ్ల పనులు ప్రారంభించలేక తీవ్ర అవస్థలు పడ్డారు. ఈ విషయాన్ని గుర్తించిన గంగిపల్లి గ్రామ సర్పంచ్ సుందిల్ల రాజేశ్వరి, ఆమె భర్త కాంగ్రెస్ నాయకుడు మల్లేష్‌ వెంటనే స్పందించారు.

బాధితుల పరిస్థితిని చూసి చలించిపోయిన సర్పంచ్‌ దంపతులు లబ్ధిదారులకు అవసరమైన ఆర్థిక సహాయాన్ని తామే అందించి ఇళ్ల నిర్మాణాలు పూర్తి చేయిస్తామని భరోసానిచ్చారు. ప్రస్తుతం వారి ప్రత్యక్ష పర్యవేక్షణలోనే నిర్మాణ పనులు శరవేగంగా జరుగుతున్నాయి.

లబ్ధిదారుల ఆనందం:

“ఇల్లు మంజూరైనా చేతిలో పైసలు లేక కట్టుకోలేకపోయాం. ఈ సమయంలో సర్పంచ్ రాజేశ్వరి, మల్లేష్‌ అన్నలు ముందుకొచ్చి మాకు ఆర్థిక సాయం అందించడం మరువలేనిది. మా సొంతింటి కలను నిజం చేస్తున్న సర్పంచ్‌ దంపతులకు జీవితాంతం రుణపడి ఉంటాం.”

— లబ్ధిదారులు (జనగామ శారద, ఉల్లెందుల లచ్చయ్య)

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.