ఇంటి కల తీరుస్తున్న ‘సుందిళ్ల’ దంపతులు
ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణానికి సొంత నిధులతో ఆర్థిక సాయం 20 మంది నిరుపేదలకు కొండంత అండగా సర్పంచ్ దంపతులు జైపూర్, అక్టోబర్ 9, ప్రజావాణి: ఇందిరమ్మ ఇళ్లు మంజూరైనా.. ఆర్థిక స్తోమత లేక ఇల్లు నిర్మించుకోలేకపోతున్న నిరుపేద కుటుంబాలకు స్థానిక సర్పంచ్ దంపతులు కొండంత అండగా నిలిచారు. గ్రామ పంచాయతీ పరిధిలోని 20 మంది అర్హులైన నిరుపేదలకు సొంత ఖర్చులతో ఆర్థిక సహాయం అందిస్తూ, ఇళ్లు పూర్తయ్యే వరకు బాధ్యత తీసుకుని తమ ఉదారతను చాటుకుంటున్నారు.గ్రామానికి చెందిన జనగామ శారద, సుందిళ్ల రాజమ్మ, జనగామ అనసూర్య,...