📄 ePaper
Epaper 2
Monday, October 12, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణMedchal-Malkajgiriడ్రైనేజీ దుర్గంధంతో ప్రజల అవస్థలు!.... హాస్టల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేయాలని డిమాండ్

డ్రైనేజీ దుర్గంధంతో ప్రజల అవస్థలు!…. హాస్టల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేయాలని డిమాండ్

📰 Generate e-Paper Clip

 

ఘట్‌కేసర్ అక్టోబర్ 9 : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్, పోచారం శివాలయం సమీపంలో ఉన్న చిన్మయ గర్ల్స్ హాస్టల్ నుంచి మురుగునీరు బయటకు వస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. డ్రైనేజీ నీటి కారణంగా పరిసరాల్లో తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోందని, అటుగా రాకపోకలు సాగించే ప్రజలు ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్యానికి సంబంధించిన సమస్యపై సంబంధిత శానిటేషన్ అధికారులు స్పందించాలని కోరుతున్నారు.

నిబంధనలు పాటిస్తున్నారా?

విద్యార్థినులకు వసతి కల్పిస్తున్న హాస్టల్‌లో మురుగునీటి నిర్వహణకు సరైన ఏర్పాట్లు ఉన్నాయా? పారిశుద్ధ్య నిబంధనలను యాజమాన్యం పాటిస్తోందా? అనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. హాస్టల్ నిర్వహణలో నిబంధనల ఉల్లంఘనలు జరుగుతున్నాయని స్థానికంగా ఆరోపణలు వినిపిస్తున్నాయి. మురుగునీరు రహదారిపైకి చేరడం వల్ల దోమలు వ్యాప్తి చెంది అంటువ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.

శానిటేషన్ అధికారులు స్పందించాలి!

ప్రజలు దుర్గంధంతో ఇబ్బందులు పడుతున్నా సంబంధిత అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. మున్సిపల్ శానిటేషన్, ప్రజారోగ్య విభాగాల అధికారులు హాస్టల్ పరిసరాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి డ్రైనేజీ సమస్యకు కారణాలను గుర్తించాలని కోరుతున్నారు. హాస్టల్ అనుమతులు, డ్రైనేజీ కనెక్షన్, మురుగునీటి నిర్వహణ ఏర్పాట్లను తనిఖీ చేయాలని డిమాండ్ చేస్తున్నారు.

యాజమాన్యానికి నోటీసులు జారీ చేయాలి!

ప్రజారోగ్యానికి ముప్పు కలిగించే పరిస్థితులను ఉపేక్షించవద్దని స్థానికులు కోరుతున్నారు. తనిఖీల్లో నిబంధనల ఉల్లంఘనలు నిర్ధారణ అయితే చిన్మయ గర్ల్స్ హాస్టల్ యాజమాన్యానికి షోకాజ్ నోటీసులు జారీ చేసి, తక్షణమే సమస్యను పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రజలు ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొన్నా అధికారులు స్పందించకపోతే ఎలా? పారిశుద్ధ్య నిబంధనలను అమలు చేయాల్సిన బాధ్యత ఎవరిది? అని ప్రశ్నిస్తున్నారు. మరి ఈ వ్యవహారంపై మున్సిపల్ అధికారులు స్పందించి చర్యలు చేపడతారా? లేదా? అన్నది వేచి చూడాల్సిందే.

 

 

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.