డ్రైనేజీ దుర్గంధంతో ప్రజల అవస్థలు!…. హాస్టల్ యాజమాన్యానికి నోటీసులు జారీ చేయాలని డిమాండ్
ఘట్‌కేసర్ అక్టోబర్ 9 : మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా ఘట్‌కేసర్ సర్కిల్ పరిధిలోని పోచారం డివిజన్, పోచారం శివాలయం సమీపంలో ఉన్న చిన్మయ గర్ల్స్ హాస్టల్ నుంచి మురుగునీరు బయటకు వస్తోందని స్థానికులు ఆరోపిస్తున్నారు. డ్రైనేజీ నీటి కారణంగా పరిసరాల్లో తీవ్ర దుర్గంధం వ్యాపిస్తోందని, అటుగా రాకపోకలు సాగించే ప్రజలు ముక్కు మూసుకుని వెళ్లాల్సిన పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజారోగ్యానికి సంబంధించిన సమస్యపై సంబంధిత శానిటేషన్ అధికారులు స్పందించాలని కోరుతున్నారు. నిబంధనలు పాటిస్తున్నారా? విద్యార్థినులకు వసతి కల్పిస్తున్న హాస్టల్‌లో మురుగునీటి నిర్వహణకు...