వరంగల్ లో సేవ్ డెమోక్రసీ ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యే యశస్విని రెడ్డి
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఐక్యంగా పోరాడాలి: కాంగ్రెస్ నాయకులు
జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 07(ప్రజావాణి): “సేవ్ డెమోక్రసీ వీక్ – ఓటు బచావో – దేశ్ బచావో ” కార్యక్రమంలో భాగంగా ఇండియా కూటమి ఆధ్వర్యంలో వరంగల్ జిల్లా కేంద్రంలో బుధవారం భారీ ర్యాలీ నిర్వహించారు.
వరంగల్ నగరంలోని పోచమ్మమైదాన్ నుంచి అంబేద్కర్ విగ్రహం వరకు ఇండియా కూటమి భాగస్వామ్య పార్టీల నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, విద్యార్థులు, మేధావులు పెద్ద సంఖ్యలో పాల్గొని ర్యాలీని విజయవంతం చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. దేశంలో ప్రజాస్వామ్యం ప్రమాదంలో పడిందని, రాజ్యాంగ విలువలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని అన్నారు. ఓటు హక్కును కాపాడుకోవడం ద్వారానే దేశాన్ని కాపాడుకోగలమని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఇండియా కూటమి ఐక్యంగా పోరాడుతుందని స్పష్టం చేశారు.

అనంతరం వరంగల్ లోని అంబేద్కర్ విగ్రహానికి ఎమ్మెల్యేలు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగ నిర్మాత ఆశయాలను కొనసాగించేందుకు అందరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు.
ఈ ర్యాలీలో పాలకుర్తి శాసన సభ్యురాలు శ్రీమతి యశస్విని రెడ్డి, టీపీసీసీ వైస్ ప్రెసిడెంట్ ఝాన్సీ రాజేందర్ రెడ్డి , ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డి , ఎమ్మెల్యే కె.ఆర్. నాగరాజు , కూడా చైర్మన్ గుండు సుధారాణి , వరంగల్ జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు ఆయూబ్ ఖాన్ తదితర ఇండియా కూటమి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు.

