📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకరువును ఎదుర్కొనేందుకు ఉపాధి పనులను వేగవంతం చేయాలి

కరువును ఎదుర్కొనేందుకు ఉపాధి పనులను వేగవంతం చేయాలి

📰 Generate e-Paper Clip

కరువును ఎదుర్కొనేందుకు ఉపాధి పనులను వేగవంతం చేయాలి

• ఆందోల్‌లో అధికారులతో సమీక్షించిన జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి బాలరాజు

ఆందోల్, అక్టోబర్ 07: మన సమగ్ర ప్రజావాణి జిల్లా ప్రతినిధి

ఆందోల్ మండల పరిషత్ కార్యాలయంలోని ఎంపీపీ సమావేశ మందిరంలో విబి-జి – ఆర్ ఏ ఎం-జి పథకంపై సంబంధిత శాఖల అధికారులతో సంగారెడ్డి జిల్లా అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి గోల బాలరాజు సమీక్ష సమావేశం నిర్వహించారు. ఎల్నినో ప్రభావంతో ఏర్పడే కరువు పరిస్థితులను ఎదుర్కొనేందుకు చేపట్టాల్సిన చర్యలు, ఉపాధి పనుల ప్రణాళికపై అధికారులకు సూచనలు చేశారు.
గ్రామాల్లో ప్రతి ఒక్కరికీ ఉపాధి పనులు కల్పించేలా చర్యలు తీసుకోవాలని, ప్రతి గ్రామంలో కనీసం 100 మందికి తగ్గకుండా ఉపాధి పనులు కల్పించేలా చూడాలని అధికారులను ఆదేశించారు. పనులకు వచ్చే వారికి కొత్త జాబ్ కార్డులను వెంటనే మంజూరు చేయాలని సూచించారు.
అలాగే ప్రతి ఇంటికి ఇంకుడు గుంత (మ్యాజిక్ సోక్ పిట్), ప్రతి రైతు పొలంలో పంటకుంట (ఫారం పాండ్), ప్రతి గ్రామంలో నీటి కుంట (ఊటకుంట) నిర్మాణాలను చేపట్టాలని తెలిపారు. గుర్తించిన పనులకు త్వరితగతిన పరిపాలనా అనుమతులు తీసుకుని పనులను ప్రారంభించాలని మండల స్థాయి అధికారులను ఆదేశించారు.
పంటకుంట పనుల పరిశీలన
అనంతరం తలెల్మ గ్రామ పంచాయతీలో చేపట్టిన ఫారం పాండ్ (పంటకుంట) నిర్మాణ పనులను అదనపు గ్రామీణాభివృద్ధి అధికారి గోల బాలరాజు, గ్రామీణాభివృద్ధి సహాయ అధికారి మధులతతో కలిసి పరిశీలించారు. మిగిలిన పనులను వెంటనే పూర్తి చేయాలని టెక్నికల్ అసిస్టెంట్ మొగులయ్య, ఫీల్డ్ అసిస్టెంట్ శివయ్యలకు సూచించారు.
సమీక్ష సమావేశంలో మండల అభివృద్ధి అధికారి కే. రాజేష్ కుమార్, మండల పంచాయతీ అధికారి రవీందర్ రెడ్డి, విబి-జి – ఆర్ ఏ ఏం -జి అదనపు కార్యక్రమ అధికారి ఎస్. అర్చన, ఇంజినీర్ కన్సల్టెంట్ ఉదయ్ కుమార్, టెక్నికల్ అసిస్టెంట్లు లక్ష్మారెడ్డి, ప్రశాంత్, మొగులయ్య, అన్ని గ్రామ పంచాయతీల కార్యదర్శులు, ఫీల్డ్ అసిస్టెంట్లు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.