📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే బాధ్యత పట్టభద్రులదే - ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే బాధ్యత పట్టభద్రులదే – ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

📰 Generate e-Paper Clip

ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే బాధ్యత పట్టభద్రులదే – ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్, అక్టోబర్ 07(ప్రజావాణి): జనగామ జిల్లా కేంద్రంలోని బీఆర్ఎస్ పార్టీ కార్యాలయంలో వరంగల్ ఖమ్మం నల్గొండ ఎమ్మెల్సీ పట్టభద్రుల ఓటర్ల నమోదు ప్రత్యేక సమావేశం జనగామ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయం లో బుధవారం జరిగింది
ఈ సందర్బంగా ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి పాల్గొని మాట్లాడుతూ
ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నించే బాధ్యత పట్టభద్రులదే అని అన్నారు. బీఆర్ఎస్ హయాంలో 1.60 లక్షల ఉద్యోగాలు భర్తీ చేశామని, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం కేవలం 12 వేల ఉద్యోగాలే ఇచ్చిందని విమర్శించారు. మెగా డీఎస్సీ పేరుతో పాత నోటిఫికేషన్‌నే మార్చి ఇచ్చారని, ఉద్యోగాల భర్తీలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని అన్నారు.

బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో పోలీస్ శాఖలో 60 వేల ఉద్యోగాలు, విద్యుత్ శాఖలో 20 వేలకు పైగా ఉద్యోగులను పర్మినెంట్ చేశామన్నారు. సింగరేణిలో 14 వేల మందికి ఉద్యోగాలు, ఆర్టీసీలో 15 వేల మంది సిబ్బందిని పర్మినెంట్ చేశామని గుర్తు చేశారు. ఉద్యోగార్థుల కోసం GO 46, GO 29 లోని సమస్యలపై కోర్టుల వరకు వెళ్లి బీఆర్ఎస్ పోరాడిందని తెలిపారు.

రాష్ట్రంలోని విశ్వవిద్యాలయాల్లో ఖాళీ పోస్టుల భర్తీకి ప్రభుత్వం కేవలం 46 పోస్టులకు మాత్రమే అనుమతి ఇచ్చిందని, మిగిలిన ఖాళీల సంగతేంటని ప్రశ్నించారు. ఉస్మానియా యూనివర్సిటీకి రూ.1,000 కోట్లు ఇస్తామని చెప్పి ఇప్పటివరకు నిధులు ఇవ్వలేదని, కాకతీయ, తెలంగాణ, శాతవాహన, పాలమూరు విశ్వవిద్యాలయాలకు నిధులు కేటాయించలేదని, గత మూడేళ్లుగా విశ్వవిద్యాలయాల్లో ఒక్క ఉద్యోగం కూడా భర్తీ చేయలేదని మండిపడ్డారు.

రైతులు విద్యుత్, సాగునీరు, ఎరువులు, యూరియా సమస్యలతో ఇబ్బందులు పడుతున్నారని, వచ్చే రెండు నెలల్లో ప్రజలపై రూ.5,200 కోట్ల విద్యుత్ చార్జీల భారం పడబోతోందని, రైతుబంధు, రైతుభీమా సరిగా అందక రైతులు నష్టపోతున్నారని అన్నారు.

పట్టభద్రుల నమోదుపై…

గతంలో ప్రతి నియోజకవర్గంలో 10 వేల నుంచి 15 వేల వరకు గ్రాడ్యుయేట్ ఓటర్లు నమోదయ్యారని, గత ఓటర్ల జాబితాను ఇప్పటికే నియోజకవర్గ ఇన్‌ఛార్జీలకు పంపించామని తెలిపారు. ప్రతి 100 మంది ఓటర్లకు ఒకరు చొప్పున, ప్రతి గ్రామానికి ఒకరు లేదా ఇద్దరు ఇన్‌ఛార్జీలను నియమించాలని, పట్టణ ప్రాంతాల్లో ప్రతి 10 వార్డులకు ఒకరి చొప్పున బాధ్యతలు అప్పగించామని అన్నారు. ప్రతి గ్రామానికి కనీసం ఒక ఇన్‌ఛార్జీని నియమించి నమోదు ప్రక్రియను వేగవంతం చేయాలని పిలుపునిచ్చారు.

బీఆర్ఎస్ శ్రేణులకు భరోసా…

గులాబీ జెండాతో గెలిచి, గులాబీ వారినే వేధిస్తున్నారని, బీఆర్ఎస్ సర్పంచులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఎమ్మెల్యే పల్లా ఆగ్రహం వ్యక్తం చేశారు. బెదిరింపులకు భయపడొద్దని, ఆర్టీసీ కార్మికులకు, బీఆర్ఎస్ కార్యకర్తలకు తాము ఎల్లప్పుడూ అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. యువతకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం నిలబెట్టుకోవాలని డిమాండ్ చేశారు.

ఈ కార్యక్రమంలో మాజీ మంత్రులు ఎర్రబెల్లి దయాకర్ రావు, తాటికొండ రాజయ్య, ఎమ్మెల్సీ ఆశహుడు ఏనుగుల రాకేష్ రెడ్డి, బిఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు పల్లా సుందర్ రామి రెడ్డి, తాళ్ల సురేష్ రెడ్డి, బబ్బురి శ్రీకాంత్ గౌడ్, బీఆర్ఎస్ పార్టీ కౌన్సిలర్లు, నాయకులు, కార్యకర్తలు, పట్టభద్రులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.