📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఇంద్రియ నిగ్రహంతో సుఖ జీవనం

ఇంద్రియ నిగ్రహంతో సుఖ జీవనం

📰 Generate e-Paper Clip

*ఇంద్రియ నిగ్రహంతో సుఖ జీవనం…*

*ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది..!*

*ఎక్కువగా మాట్లాడితే జ్ఞాపకశక్తి తగ్గుతుంది.*

*స్వర్ణగిరి ఆలయ ప్రధానర్చకులు దిట్టకవి శ్రవణాచార్యులు.*

*యాదాద్రి భువనగిరి జిల్లా మన ప్రజావాణి జిల్లా ప్రతినిధి అక్టోబర్ 07*

భగవంతుడు తన సృష్టి లో అగ్రభాగాన నిలిపిన జీవులు…మానవులు. మనం ఆనందంగా , ఆరోగ్యంగా ఉండటానికి ఐదు జ్ఞానేంద్రియాలని ఇచ్చాడు. అవి కళ్లు , చెవులు , ముక్కు , చర్మం , నాలుక , బాహ్య సంబంధ మైన విషయాలను గ్రహించి మేధస్సుకు అందజేయడం వీటి పని. అయితే ఈ ఐదు ఇంద్రి యాలనూ అవసర మైనపుడు , అవసరమైన మేరకే ఉపయోగించు కోవాలి. దీనినే ఇంద్రియ నిగ్రహం అంటారు. అది లేకుంటే ఆనందానికి బదులు అనర్థాలు సంభ విస్తాయి. ఉదాహరణకు.. కళ్లున్నాయి గదా అని అనవసరమైన , పనికి మాలిన దృశ్యాలను చూస్తూ కూర్చోరాదు. చెవులున్నాయని ఇతరులు చెప్పే చాడీలు , కబుర్లు వింటూ వినికిడి శక్తిని వృథా చేయరాదు. చూడటం , వినటం , మాట్లాడటం ఒక స్థాయిని దాటితే మనలో గల జీవ శక్తి క్షీణించిపోతుంది. అనారోగ్యాలు సంభ విస్తాయి. చూడటం , వినటం కన్నా మాట్లాడ టం శరీర పటుత్వాన్ని బాగా తగ్గిస్తుంది. అందుకే ఎంత తక్కువగా , మెల్లగా మాట్లాడితే అంత మంచిది. అధిక భాషణ వల్ల అసత్యాలు , పర నింద , ఆత్మస్తుతి దొర్లు తాయి. ఇవన్నీ పాప హేతువులే. అందుకే మహర్షులు సాధ్యమైనంత వరకు మౌనం పాటించే వారు. అంతేకాదు… ఎక్కువగా మాట్లాడితే జ్ఞాపకశక్తి తగ్గిపోతుంది. స్వామి వివేకానంద వద్దకు ఒక సందర్భంలో సందర్శ కులు అధికంగా రావటం వల్ల పదిరోజులపాటు ఆయన ఎక్కువగా మాట్లాడాల్సి వచ్చింది. పదకొండో రోజుకు తాను బాగా కంఠస్తం చేసిన శ్లోకాలు మరచి పోయారు ఆయన. ఎంత ప్రయత్నించినా జ్ఞాపకం రాలేదు. దీంతో తన సహచరుడైన స్వామి సదానందను సంప్ర దించారు. అప్పుడు ఆయన… “వివేకా..! పది రోజులుగా నీ అధిక భాషణ వల్లనే జ్ఞాపకశక్తి క్షీణించి పోతున్నది. కొన్ని రోజుల పాటు మౌనం పాటించు. ఫలితం ఉండవచ్చు’ అని సూచించారు. ఆ క్షణం నుండే వివేకానందుడు 15 రోజుల పాటు పూర్తిగా మౌనం పాటించారు. స్వామి సదానంద చెప్పి నట్లే ఆయన జ్ఞాపకశక్తి పెరిగింది. తాను నేర్చు కున్న శ్లోకాలు జ్ఞాపకం రాసాగాయి. ఇక , నాలుక విషయానికి వస్తే… మాట్లాడటం మాత్రమే గాక ఆహారం స్వీకరించట మనే మరో బాధ్యత దానికి ఉంది. నాలుక రుచులను మరిగితే… మనం అవసరానికి మించి భుజిస్తాం. కానీ , ఆ రుచుల ఆస్వాదన ఎంత వరకూ..? 3 అంగుళాల పొడవైన నాలుకపైన పదార్థం ఉన్నంత వరకే..! ఆ కొన్ని క్షణాలు మాత్రమే..! గొంతు దాటాక…అది జీర్ణకోశాన్ని చేరుతుంది. జీర్ణకోశానికి ఏ రుచులూ తెలియవు. ఈ విషయాన్ని గుర్తుంచు కుని మితంగాభుజించాలి. ఇది ఇష్టం , అది ఇష్టం అంటూ అతిగా భుజించ టం వల్ల అనారోగ్యాల బారిన పడతాం. పశు పక్ష్యాదులు మనుషుల్లాగా కాదు. ఆకలేసినప్పుడు కడుపు నిండేంతవరకే… మితంగా భుజిస్తాయి. తమకు భగవంతుడు నిర్దేశించిన పదార్థాలు మాత్రమే తింటాయి. అందుకే అవి అనా రోగ్యాల పాలయ్యే సందర్భాలు తక్కువ. ఏ మాత్రం అనారోగ్య లక్షణం కన్పించినా అవి తక్షణం తినటం మానేస్తాయి. వాటి ఆరోగ్యం కుదుట బడుతుంది. పశువులే అలా ఉండ గలిగి నప్పుడు…వాటికన్నా తెలివైన మనిషి ఇంకెంత నిగ్రహంతో ఉండాలి..? కాబట్టి…శబ్ద , స్పర్శ , రస , రూప , గంధాదులకు కీలకమైన ఐదు జ్ఞా నేంద్రి యాలనూ అదుపులో ఉంచుకొని పాపకర్మలు చేయకుండా హాయిగా , ఆరోగ్యంగా ఉండాలని యాదాద్రి తిరుమల స్వర్ణగీరీషుని కృపా కటాక్షాలు నీకు ఎల్లవేళలా ఉండాలని కోరు కుంటున్నాం.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.