📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణవిద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ

విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ

📰 Generate e-Paper Clip

విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ
కూసుమంచి, అక్టోబర్ 7 (ప్రజావాణి):
కూసుమంచి మండలంలోని చిన్న పోచారం( వెంకట్రాంపురం) గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం విద్యార్థులకు పాఠశాల యూనిఫామ్‌లను పంపిణీ చేశారు. పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు యూనిఫామ్‌లను అందజేసి, విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పోచారం గ్రామ సర్పంచ్ సలవాది గురుమూర్తి, ఉప సర్పంచ్ ముంగి వెంకన్న, గ్రామపంచాయతీ కార్యదర్శి రాంబాబు, ఉపాధ్యాయురాలు రమాదేవి, వార్డు సభ్యులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు గ్రామపంచాయతీ తరఫున సహకారం అందిస్తామని సర్పంచ్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.