విద్యార్థులకు యూనిఫామ్‌ల పంపిణీ
కూసుమంచి, అక్టోబర్ 7 (ప్రజావాణి):
కూసుమంచి మండలంలోని చిన్న పోచారం( వెంకట్రాంపురం) గ్రామ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో బుధవారం విద్యార్థులకు పాఠశాల యూనిఫామ్‌లను పంపిణీ చేశారు. పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో విద్యార్థులకు యూనిఫామ్‌లను అందజేసి, విద్యార్థులు క్రమశిక్షణతో విద్యను అభ్యసించి ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో పోచారం గ్రామ సర్పంచ్ సలవాది గురుమూర్తి, ఉప సర్పంచ్ ముంగి వెంకన్న, గ్రామపంచాయతీ కార్యదర్శి రాంబాబు, ఉపాధ్యాయురాలు రమాదేవి, వార్డు సభ్యులు, పాఠశాల విద్యార్థులు పాల్గొన్నారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాలు కల్పించేందుకు గ్రామపంచాయతీ తరఫున సహకారం అందిస్తామని సర్పంచ్ తెలిపారు.