📄 ePaper
Epaper 2
Wednesday, October 7, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణసూరారం గ్రామానికి దారేది

సూరారం గ్రామానికి దారేది

📰 Generate e-Paper Clip

సూరారం గ్రామానికి దారేది….

ఎల్కతుర్తి,ప్రజావాణి న్యూస్:-

హన్మకొండ జిల్లా ఎల్కతుర్తి మండల పరిధిలోని సూరారం గ్రామానికి జాతీయ రహదారి నిర్మాణం కారణంగా సరైన రహదారి మార్గం లేకపోవడంతో గ్రామస్థులు మంగళవారం జాతీయ రహదారిపై ధర్నా నిర్వహించారు. సూరారం గ్రామానికి వెళ్లేందుకు అండర్‌పాస్ ఏర్పాటు చేసి, శాశ్వతంగా రహదారి సౌకర్యం కల్పించాలని వారు డిమాండ్ చేశారు.
గ్రామంలో సుమారు 50 శాతం మంది గొల్లకుర్మ సామాజిక వర్గానికి చెందిన కుటుంబాలు ఉన్నాయని, వారి వద్ద వేల సంఖ్యలో గొర్రెలు,మేకలు,పశువులు, ఎడ్లు ఉన్నాయని గ్రామస్థులు తెలిపారు. రహదారి సౌకర్యం లేకపోవడంతో పశువులను పొలాలకు, మేతకు తీసుకెళ్లేందుకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. అత్యవసర సమయంలో గ్రామానికి రాకపోకలు కూడా కష్టతరంగా మారుతున్నాయని తెలిపారు.
గ్రామస్థులు జాతీయ రహదారిపై వాహనాలను నిలిపివేసి సుమారు గంటపాటు నిరసన చేపట్టారు.“సూరారం గ్రామానికి దారి కల్పించాలి.. అండర్‌పాస్ ఏర్పాటు చేయాలి” అంటూ నినాదాలు చేశారు.
సమాచారం అందుకున్న ఎల్కతుర్తి సీఐ శ్రీను అక్కడికి చేరుకుని గ్రామస్థులతో మాట్లాడి ధర్నా విరమించాలని సూచించారు. జాతీయ రహదారిపై వాహనాలను నిలిపివేయడం వల్ల ప్రయాణికులకు, వాహనదారులకు ఇబ్బందులు కలుగుతున్నాయని ఆయన తెలిపారు. గ్రామస్థుల సమస్యను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు ధర్నాను విరమించారు.
ఈ కార్యక్రమంలో ఎల్కతుర్తి ఎస్‌ఐ నరసింహారావు, ఏఎస్‌ఐ శంకర్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. గ్రామానికి శాశ్వత రహదారి సౌకర్యం కల్పించడంతో పాటు అండర్‌పాస్ నిర్మించాలని గ్రామస్థులు సంబంధిత అధికారులు, జాతీయ రహదారుల శాఖ అధికారులను కోరారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.