ప్రజాస్వామ్య హక్కులను కాలరాస్తున్న బిజెపి
-మోతీలాల్ నాయక్
నాగర్ కర్నూల్ జిల్లా…
కల్వకుర్తి నియోజకవర్గ ప్రతినిధి/అక్టోబర్ 06:
(ప్రజావాణి)
ఎన్నికల కమిషన్ ముసుగులో దేశ వ్యాప్తంగా ప్రజల ఓట్లను గల్లంతు చేస్తూ ప్రజాస్వామ్య హక్కులను బిజెపి ప్రభుత్వం కాలరాస్తుందని కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి,దిశ కమిటీ జిల్లా సభ్యులు ఎం.మోతీలాల్ నాయక్ ఆరోపించారు.
మంగళవారం మండల కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాజ్యాంగ హక్కులను,ప్రజాస్వామ్య పునాదులను కూల్చే కుట్రలో భాగంగానే ఆర్ఎస్ఎస్ ఆదేశాల మేరకు దేశ వ్యాప్తంగా దళిత,ఆదివాసీ, గిరిజన,బడుగు,బలహీన,ముస్లిం,మైనార్టీ వర్గాల ప్రజల ఓట్ల తొలగింపే లక్ష్యంగా నరేంద్ర మోడీ, అమిత్ షా లు కేంద్ర ఎన్నికల కమిషన్ చాటున ఓట్ల చోరీ చేస్తూ ప్రజాస్వామ్య దేశాన్ని విచ్ఛిన్నం చేసి మత రాజ్య స్థాపన కోసం కుట్ర చేస్తున్నారని ఆయన విమర్శించారు.
దేశ ఐక్యత కోసం,ప్రజాస్వామ్య, రాజ్యాంగ హక్కుల పరిరక్షణ కోసం రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేపట్టి అన్ని వర్గాల ప్రజలను ఏకం చేస్తున్న ఈ తరుణంలో మళ్ళీ ప్రజాస్వామ్య హక్కులను తుంగలో తొక్కి అధికార అహంకారంతో మత,కుల, ప్రాంత విధ్వేషాలతో ఓట్ల తొలగింపుకు బిజెపి ప్రభుత్వం తెరలేపిందని ఆయన పేర్కొన్నారు.బిజెపి ప్రభుత్వం ఒక పక్క అన్ని రంగాలలో దేశాన్ని దోపిడీ చేస్తూ మరో పక్క రాజ్యాంగాన్ని తొలగించే కుటీల బుద్ధిని ప్రశ్నిస్తూ ఎన్నికల కమిషన్ చైర్మన్ జ్జానేశ్ కుమార్ ను వెంటనే అరెస్టు చేయాలని ఎన్నికల కమిషన్ కేంద్ర కార్యాలయాన్ని ప్రజాస్వామ్యయుతంగా వెళ్తున్న ప్రతిపక్ష నాయకులు రాహుల్ గాంధీ,ప్రియాంక గాంధీలతో పాటు పార్లమెంట్ సభ్యులను నేడు అనైతికంగా,అక్రమంగా అరెస్టు చేయడం శోచనీయమని ఆయన పేర్కొన్నారు.
కేంద్ర ప్రభుత్వం ఎన్నికల కమిషన్ జ్ఞానేష్ కుమార్ ను వెంటనే తొలగించాలనే దేశ వ్యాప్తంగా ప్రజల,ప్రతిపక్ష పార్టీల నేతల డిమాండ్ ను స్వీకరించి తదనుగుణంగా ఎన్నికల కమిషన్ పూర్తి స్థాయిలో ప్రక్షాళన చేపట్టి జ్ఞానేష్ కుమార్ ను తొలగించి చిత్తశుద్ధిని చాటుకోవాలని ఆయన తెలిపారు.లేదంటే ప్రజాస్వామ్య హక్కులను,దేశాన్ని దోపిడీ చేస్తున్నారనే భావన దేశ ప్రజల్లో వ్యక్తమై రాబోయే కాలంలో ప్రజాగ్రహంతో బిజెపి పార్టీకి పుట్టగతులుండవని ఆయన హెచ్చరించారు.
కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు దేశ వ్యాప్తంగా చేపడుతున్న ఓటు బచావో,దేశ్ బచావో ఆందోళన కార్యక్రమంలో ప్రజలు,ప్రజా సంఘాలతో మమేకంతో కాంగ్రెస్ పార్టీ నాయకులు,కార్యకర్తలు గ్రామీణ స్థాయి నుండి దేశ స్థాయి వరకు సైకిల్,బైక్ ర్యాలీలు,పాదయాత్రలు చేపట్టి ఎన్నికల కమిషన్ ముసుగులో చేపడుతున్న ఓటు చోరీ వ్యవహారాన్ని ప్రజలకు వివరించి ఉద్యమాన్ని ఉదృతం చేయాలని ఆయన తెలిపారు.ఈ కార్యక్రమంలో కిసాన్ సెల్ తాలూకా అధ్యక్షులు పర్వత్ రెడ్డి,మాజీ ఎంపీటీసీ చల్లా వెంకట్ రెడ్డి,మాజీ సర్పంచులు రామస్వామి యాదవ్,బాక్యా నాయక్, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దొబ్బల వెంకటయ్య,తిరుపతి రెడ్డి,చందు నాయక్,రెడ్యా నాయక్,సంజీవ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.

