లక్ష్మీపురంలో మురళీ నాయక్ జన్మదిన వేడుకలు..
ప్రజావాణి,ఇనుగుర్తి: మహబూబాబాద్ జిల్లా ఇనుగుర్తి మండలం లక్ష్మీపురం లో
మానుకోట ఎమ్మెల్యే డా.భూక్య మురళి నాయక్ జన్మదిన వేడుకలు ఆ గ్రామ సర్పంచి ముదిరెడ్డి కళావతి, పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు ముదిరెడ్డి శ్రీనివాస్ రెడ్డిల ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు.మురళీ నాయక్ బర్త్ డే కేకును కళావతి శ్రీనివాస్ రెడ్డి ప్రభృతులు కట్ చేశారు. స్వీట్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కళావతి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ ప్రజా నేత,మృదుస్వభావి, మానుకోట అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే డా.మురళి నాయక్ మానుకోట నియోజకవర్గాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేస్తున్నారని,మరిన్ని గొప్ప పదవులు అధిరోహిస్తూ ప్రజాసేవలో కలకాలం కొనసాగాలని ఆకాంక్షించారు. ఎమ్మెల్యే కు బర్త్ డే శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో ఉప సర్పంచ్ బద్రు, వార్డ్ మెంబర్ అశోక్,సావిత్ర, వీరన్న,పరమేష్, నాయకులు బాణాల వెంకన్న ఎల్ వెంకన్న,భూక్య లాలు,ముత్యాల వెంకన్న, లచ్చయ్య,గాడి పెళ్లి వెంకన్న,బాణాల భిక్షం, చిన్న బిక్షం,చిన్న వెంకన్న,శ్రీను,కర్ణ కంటి సంజీవరెడ్డి,యాకుబ్ రెడ్డి మహిళా నాయకులు కర్ణ గంటి లక్ష్మి,శేషమ్మ,సముద్రమ్మ,సరస్వతి, ధనమ్మ,రమ,జమున,భారతమ్మ,లక్ష్మి, గ్రామస్తులు పాల్గొన్నారు.

