📄 ePaper
Epaper 2
Tuesday, October 6, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణదసరా నాటికి రెండు పడకగదుల ఇండ్ల అప్పగింతకు చర్యలు

దసరా నాటికి రెండు పడకగదుల ఇండ్ల అప్పగింతకు చర్యలు

📰 Generate e-Paper Clip

దసరా నాటికి రెండు పడకగదుల ఇండ్ల అప్పగింతకు చర్యలు

జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య

*మన ప్రజావాణి*
*మంచిర్యాల జిల్లా*

జిల్లాలోని రెండు పడక గదుల ఇండ్ల సముదాయాలను ఈ దసరా నాటికి లబ్ధిదారులకు అప్పగించేలా చర్యలు చేపట్టాలని జిల్లా అదనపు కలెక్టర్ (స్థానిక సంస్థలు) పి.చంద్రయ్య అన్నారు. మంగళవారం జిల్లాలోని మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్, క్యాతన్‌పల్లి, మందమర్రి మున్సిపాలిటీల పరిధిలోని రెండు పడక గదుల ఇండ్ల గృహ సముదాయాలను గృహ నిర్మాణ శాఖ పి.డి., డి.ఈ., ఎ.ఈ. లతో కలిసి క్షేత్రస్థాయిలో సందర్శించి గృహ సముదాయాలలో పెండింగ్ పనులు, త్రాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, పారిశుధ్యం తదితర మౌలిక సదుపాయాలను పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ దసరా నాటికి రెండు పడక గదుల ఇండ్లను లబ్ధిదారులకు అందించేందుకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. మిగిలిన పనులను వేగవంతంగా పూర్తి చేసి, లబ్ధిదారులకు గృహాల అప్పగింతకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు దసరా నాటికి గృహ సముదాయాలను లబ్ధిదారులకు అందుబాటులోకి తీసుకురావడమే లక్ష్యంగా అధికారులు సమన్వయంతో పని చేయాలని సూచించారుఈ కార్యక్రమంలో మంచిర్యాల మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ కమిషనర్, తహసిల్దార్, క్యాతన్‌పల్లిలో మున్సిపల్ కమిషనర్, డిప్యూటీ తహసీల్దార్, మందమర్రిలో మున్సిపల్ కమిషనర్, రెవెన్యూ, మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు..

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.