📄 ePaper
Epaper 2
Tuesday, October 6, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఅనాథ పిల్లలకు అన్నదానం చేసి స్ఫూర్తి చాటిన మిత్రబృందం..

అనాథ పిల్లలకు అన్నదానం చేసి స్ఫూర్తి చాటిన మిత్రబృందం..

📰 Generate e-Paper Clip

అనాథ పిల్లలకు అన్నదానం చేసి స్ఫూర్తి చాటిన మిత్రబృందం..

స్నేహితుడి ప్రథమ వర్ధంతి వేళ.

స్నేహం అంటే కలిసి తిరగడం కాదు..మిత్రుడి జ్ఞాపకాలను సమాజ సేవలో సజీవం చేయడమే:

జనగామ జిల్లా ప్రతినిధి జె.ఉపేందర్ అక్టోబర్ 06(ప్రజావాణి): స్నేహం అంటే కేవలం కలిసి తిరగడమే కాదు.. మరణించిన మిత్రుడి జ్ఞాపకాలను సమాజ సేవలో సజీవంగా ఉంచడమేనని నిరూపించారు జనగామ జిల్లా పాలకుర్తి మండలం గూడూరు గ్రామానికి చెందిన యువకులు.

గ్రామానికి చెందిన ఎదునూరి రాజేష్ సంవత్సరం క్రితం అకాల మరణం చెందారు. ఆయన ప్రథమ సంవత్సర వర్ధంతిని పురస్కరించుకుని, ఆయన తోటి స్నేహితులంతా కలిసి ఒక ఆదర్శవంతమైన కార్యక్రమానికి చేపట్టారు
రాజేష్ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పించారు.
అనంతరం సమాజంలో ఆదరణ కరువైన అనాథ పిల్లల ఆకలి తీర్చాలని నిర్ణయించుకున్నారు.

ఈ క్రమంలోనే మిత్రబృందం అంతా కలిసి ‘అమ్మ ఫౌండేషన్’ వారి అనాథ పిల్లల ఆశ్రమాన్ని సందర్శించారు.

రాజేష్ జ్ఞాపకార్థం అక్కడ ఆశ్రమంలో అనాథ పిల్లలకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. పిల్లలకు స్వయంగా వడ్డించి, వారితో సమయాన్ని గడిపి మిత్రుడి రాజేష్ ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు.

ఈ కార్యక్రమంలో రాజేష్ ప్రాణమిత్రులు మాచర్ల సునీల్, దుస్సా హరీష్, లోంక శివమణి, పడాల నరేష్, పొన్నం వెంకటేష్, దుస్సా ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు…

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.