📄 ePaper
Epaper 2
Tuesday, October 6, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణఫుట్ పాత్ మాయం..రోడ్డే దిక్కు

ఫుట్ పాత్ మాయం..రోడ్డే దిక్కు

📰 Generate e-Paper Clip

ఫుట్ పాత్ మాయం..రోడ్డే దిక్కు.!
.పసరలో పాదచారుల అవస్థలు.
.పసర మెయిన్ రోడ్డులో ఫుట్ పాత్ ఆక్రమణ .

ములుగు ప్రతినిధి (ప్రజావాణి)

ములుగు జిల్లా గోవిందరావుపేట మండలం పస్రా మెయిన్ రోడ్డుపై పాదచారుల సౌకర్యార్థం ఏర్పాటు చేసిన ఫుట్ పాత్ పూర్తిగా ఆక్రమణకు గురై ప్రజలకు శాపంగా మారింది. కొంతమంది వ్యాపారులు తమ వ్యాపార సామాగ్రి అయిన ఖాళీ సీసాలు, స్క్రాప్ ఇనుము, తుప్పు పట్టిన పాత వాహనాలు మరియు ఇతర వస్తువులతో ఫుట్ పాత్ ను పూర్తిగా ఆక్రమించుకున్నారు.
దీంతో ఫుట్ పాత్ పై నడవాల్సిన పాదచారులు నడవలేక, ప్రమాదకరమైన మెయిన్ రోడ్డుపై వాహనాల మధ్య ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని నడవాల్సి వస్తోంది. ముఖ్యంగా స్కూలుకు వెళ్లే చిన్నారులు, వృద్ధులు, మహిళలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎప్పుడు ప్రమాదం జరుగుతుందోనని భయాందోళనలో ఉన్నారు.
ప్రజల ప్రాణ భద్రతను దృష్టిలో ఉంచుకుని సంబంధిత అధికారులు వెంటనే స్పందించి ఆక్రమణలను తొలగించి, ఫుట్ పాత్ ను ఖాళీ చేయించాలని స్థానికులు కోరుతున్నారు. పాదచారులు సురక్షితంగా నడిచేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు. ఇది ఎవరికీ వ్యతిరేకం కాదని, కేవలం ప్రజల ప్రాణ భద్రత కోసమే ఈ విజ్ఞప్తి చేస్తున్నామని వారు స్పష్టం చేశారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.