అంగన్వాడీల సేవలు అభినందనీయం..
బిజెపి మహిళా స్టేట్ ప్రెసిడెంట్ డా.శిల్పారెడ్డి
బిజెపి ఆధ్వర్యంలో అంగన్వాడి ఆశాలకు ఘన సన్మానం..
ప్రజావాణి,ఇనుగుర్తి: మోడీ పాలన 25 సం.లు,
ప్రధాని జన్మదినం పురస్కరించుకొ ని సంకల్ప్ అభియాన్ కార్యక్రమం నెల రోజులపాటు బిజెపి నిర్వహిస్తోంది. ఈ క్రమంలో మండలంలోని మునిగలవీడు గ్రామంలోని అంగన్వాడీ టీచర్లను బిజెపి మండల అధ్యక్షులు దుంపల సందీప్ ఆధ్వర్యంలో రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు డా.శిల్పారెడ్డి, జిల్లా అధ్యక్షులు సరోజిని తో పాటు,పార్టీ నాయకులు మంగళవారం ఘనంగా సన్మానించారు.
ఈ సందర్భంగా శిల్పారెడ్డి మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్లు ఇంకేం గ్రామీణ ప్రాంతాల్లో చిన్నారులు,మహిళల ఆరోగ్యం, పౌష్టికాహారం కోసం అందిస్తున్న సేవలను అభినందించారు.కార్యక్రమంలో రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఒద్దిరాజు రామచంద్ర రావు, జిల్లా ప్రధాన కార్యదర్శి చీకటి మహేష్ గౌడ్,మదన్ లాల్,చిన్య తండ ఉపసర్పంచ్ కవిత,ఎస్టీ మోర్చా మండల అధ్యక్షుడు సపావతు సురేష్, పోలెపల్లి వెంకటేశ్వర్లు,లావుడియా బాలునాయక్ వివిధ గ్రామాల లను నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

