చింతూరు కేంద్రం గా జ్యుడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కోర్టు ఏర్పాటు చేయాలి కూనవరం మండల అఖిలపక్షాల ఏకగ్రీవ తీర్మానం
ప్రజావాణి ప్రతినిధి కూనవరం: మండలం అక్టోబర్ 5
పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కూనవరం మండల కేంద్రంలో అఖిలపక్షాల ఆధ్వర్యంలో సోమవారం అత్యవసర సమావేశం నిర్వహించారు. పదముత్యం ప్రతాప్ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చింతూరును కేంద్రంగా చేసుకుని ఫస్ట్ క్లాస్ కోర్టు, అడిషనల్ కోర్టు, మొబైల్ కోర్టు ఏర్పాటు చేయాలని అఖిలపక్ష నాయకులు, న్యాయవాదులు, పాత్రికేయులు ఏకగ్రీవంగా తీర్మానించారు.
చింతూరు ఐటీడీఏ పరిధిలోని నాలుగు మండలాల్లో వివిధ ప్రభుత్వ కార్యాలయాలు ఉన్నప్పటికీ, కోర్టు సౌకర్యం అందుబాటులో లేకపోవడంతో ప్రజలు న్యాయపరమైన అవసరాల కోసం దూర ప్రాంతాలకు వెళ్లాల్సి వస్తోందని సమావేశంలో పేర్కొన్నారు. దీంతో ప్రజలకు సమయం, ఆర్థిక భారం పెరగడంతో పాటు ముఖ్యంగా గిరిజన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు.
ప్రజలు ఎదుర్కొంటున్న న్యాయపరమైన సమస్యలను దృష్టిలో ఉంచుకుని చింతూరు కేంద్రంగా ఫస్ట్ క్లాస్ కోర్టుతో పాటు అవసరమైన మేరకు అడిషనల్ కోర్టు, మొబైల్ కోర్టు ఏర్పాటు చేయాలని అఖిలపక్ష సమావేశంలో ఏకగ్రీవంగా తీర్మానించారు.
ఈ తీర్మానాన్ని ప్రభుత్వానికి నివేదిక రూపంలో అందజేసి, చింతూరు కేంద్రం గా కోర్టుల ఏర్పాటుకు అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరనున్నట్లు అఖిలపక్ష నాయకులు తెలిపారు.
ఈ సమావేశంలో సీనియర్ న్యాయవాదులు మోసం సంజీవరావు,సున్నం వెంకట రమణ, కూనవరం టీ.డీ.పి మండల అధ్యక్షులు యడవల్లి భాస్కర్ రావు గారు, పోడియం అప్పారావు, బి.జె.పి. నాయకులు నోముల రామారావు, జనసేన దాసరి నరేంద్ర, వై.ఎస్. అర్.సి.పి పార్టీ నాయకులు ఆలూరి కోటయ్య, గిరిజన సంఘం నాయకులు కుంజా అనిల్, సి.పి.ఐ పార్టీ నాయకులు జుత్తుక సూర్యచందరరావు, A.V.S.P నాయకులు సోడే ముత్తయ్య, కాంగ్రెస్ పార్టీ నాయకులు శ్రీమంతుల సతీష్, శ్రీమంతుల వెంకటరమణ, B J P నాయకులు కరక రాజ్ కుమార్,కరక పవన్ తదితరులు పాల్గొన్నారు.

