*ఆదివాసీ ప్రాంతాల్లో 1/70, పేసా చట్టాల ఉల్లంఘన సహించేది లేదు*
*అక్రమ కట్టడాలను వెంటనే నిలిపివేయాలి — ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ హెచ్చరిక*
*ఏజెన్సీ చట్టాలను కాపాడుకోవాలి – నూతన పేసా కమిటీలను ఎన్నుకోవాలి*
కొత్తగూడ మండల ప్రతినిధి:- అక్టోబర్ 05 (మన సమగ్ర ప్రజావాణి):- మహబూబాబాద్ జిల్లా, కొత్తగూడ గ్రామపంచాయతీ పరిధిలో పేసా గ్రామ సభ అనుమతులు లేకుండా అక్రమంగా నిర్మిస్తున్న నిర్మాణాలను వెంటనే నిలిపివేయాలని, కొత్తగూడ గ్రామ పంచాయితీ కార్యదర్శి ఆడుప దివాకర్ కు మెమోరాండం సమర్పించిన తుడుం దెబ్బ నాయకులు. అనంతరం తుడుం దెబ్బ మండల అధ్యక్షుడు పూనేం సందీప్ మాట్లాడుతూ… 5వ షెడ్యూల్ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసులకు రాజ్యాంగం కల్పించిన చట్టబద్ధమైన హక్కులను కాలరాస్తూ, అక్రమంగా బహుళ అంతస్తుల భవనాలు నిర్మించేందుకు తీవ్ర ప్రయత్నాలు జరుగుతున్నాయని, వాటిని వెంటనే నిలిపివేయాలని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ మండల అధ్యక్షుడు పూణేం సందీప్ కుమార్ డిమాండ్ చేశారు. 1/70 చట్టం అలాగే పేసా (పేసా) 1996 చట్టాలను బహిరంగంగా ఉల్లంఘిస్తూ.. అక్రమ నిర్మాణాలకు పాల్పడుతున్న వారిపై శాఖాపరమైన, చట్టపరమైన కఠిన చర్యలు తీసుకోవాలని ఆదివాసీ నాయకులు స్పష్టం చేశారు. అక్రమ నిర్మాణాల నిలిపివేత, ఏజెన్సీ ప్రాంతా లలో నిబంధనలకు విరుద్ధంగా బహుళ అంతస్తులు నిర్మించడానికి చేస్తున్న ప్రయత్నాలను తక్షణమే విరమించుకోవాలని, 1/70, పేసా చట్టాల సమర్థవంతమైన అమలు చేయాలని, ఐదవ షెడ్యూల్ ప్రాంతాలలో ఆదివాసుల భూములు, హక్కుల రక్షణ కోసం 1/70 అలాగే పేసా కమిటీల అధికారాలను పూర్తి స్థాయిలో పరిరక్షించాలని, 1/70 అలాగే పేసా చట్టాల రక్షణ ఏజెన్సీలోని ఆదివాసీలందరి ప్రాథమిక బాధ్యతగా గుర్తించాలని, నూతన పేసా కమిటీల ఎంపిక చేయాలని, ఏజెన్సీ నిబంధనల ప్రకారం నూతన పేసా (పేసా) కమిటీల ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా జరిగేలా ఐటీడీఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ (ఐటీడీఏ పీవో) తక్షణమే ప్రత్యేక చర్యలు తీసుకోవాలని, ఏజెన్సీ చట్టాలను అతిక్రమించి అక్రమ నిర్మాణాలకు ప్రోత్సాహం అందిస్తున్న అధికారుల పై అలాగే సంబంధిత వ్యక్తులపై ఐటీడీఏ అధికారులు దృష్టి సారించి కఠిన చర్యలు తీసుకోకపోతే? రాబోయే రోజుల్లో కొత్తగూడ మండలం ఏజెన్సీ వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని ఆదివాసీ హక్కుల పోరాట సమితి తుడుందెబ్బ నాయకులు హెచ్చరించారు.
ఒక పక్క గిరిజనేతరులు ఏజెన్సీ చట్టాలను హక్కులను జీవో లను తొలగించెందుకు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారని ఆదివాసీలు అప్రమత్తంగా ఉండాలని గిరిజనేతరుల మాయలో పడొద్దు అని అన్నారు. కార్యక్రమంలో తుడుందెబ్బ కొత్తగూడ మండల అధ్యక్షుడు నేను సందీప్ కుమార్, తుడుం దెబ్బ మండల ప్రధాన కార్యదర్శి మల్లెల సారయ్య, ఆదివాసీ విద్యార్థిసంఘం వజ్జ రాహుల్, కంగాల నాగేశ్వర్ రావు వార్డ్ మెంబర్ జీపీ కొత్తగూడ, తోలేం వెంకన్న, తదితరులు పాల్గొన్నారు.

