📄 ePaper
Epaper 2
Tuesday, October 6, 2026
📄 ePaper
EVENING EDITION
Homeఎడిటోరియల్తెట్టెలపాడు నుంచి కాంగ్రెస్‌లోకి 25 కుటుంబాలు

తెట్టెలపాడు నుంచి కాంగ్రెస్‌లోకి 25 కుటుంబాలు

📰 Generate e-Paper Clip

తెట్టెలపాడు నుంచి కాంగ్రెస్‌లోకి 25 కుటుంబాలు
మంత్రి పొంగులేటి అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై
పాలేరు ప్రజావాణి అక్టోబర్ 5
: తిరుమలాయపాలెం మండలం తెట్టెలపాడు గ్రామానికి చెందిన 25 కుటుంబాలు బీఆర్‌ఎస్‌, ఎంఎల్‌, టీడీపీ పార్టీలను వీడి కాంగ్రెస్‌ పార్టీలో చేరాయి. పాలేరు నియోజకవర్గంలో రాష్ట్ర రెవెన్యూ, గృహ నిర్మాణం, సమాచార శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి చేపడుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలకు ఆకర్షితులై కాంగ్రెస్‌లో చేరినట్లు వారు తెలిపారు.
ఖమ్మంలోని మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి క్యాంపు కార్యాలయంలో సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో క్యాంపు కార్యాలయ ఇన్‌చార్జ్‌ తుంబూరు దయాకర్‌రెడ్డి వారికి కాంగ్రెస్‌ పార్టీ కండువాలు కప్పి సాదరంగా ఆహ్వానించారు.
ఈ సందర్భంగా దయాకర్‌రెడ్డి మాట్లాడుతూ గత పాలకులు పేదల సంక్షేమాన్ని విస్మరించారని, కాంగ్రెస్‌ ప్రభుత్వం ప్రజా పాలనకు ప్రాధాన్యమిస్తూ అర్హులైన ప్రతి ఒక్కరికీ సంక్షేమ పథకాలు అందిస్తోందన్నారు. రేషన్‌ కార్డులు, ఇందిరమ్మ ఇళ్లు, సన్నబియ్యం పంపిణీతో పాటు రైతులు, మహిళల అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేస్తోందని తెలిపారు. కాంగ్రెస్‌లో చేరిన ప్రతి కుటుంబానికి మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి అండదండలు ఉంటాయని పేర్కొన్నారు.
కార్యక్రమంలో ఆత్మ కమిటీ పాలేరు నియోజకవర్గ చైర్మన్‌ చావా శివరామకృష్ణ, కాంగ్రెస్‌ మండల అధ్యక్షుడు కొప్పుల అశోక్‌, మాజీ ఎంపీపీ బోడా మంగీలాల్‌, మండల ఉపాధ్యక్షుడు సామా శ్రీనివాసరెడ్డి, యూత్‌ కాంగ్రెస్‌ అధ్యక్షుడు దూదిమెట్ల వెంకట్‌, నాయకులు పుసులూరి సురేష్‌, మాజీ ఎంపీటీసీ గోళ్ల లింగయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.