📄 ePaper
Epaper 2
Monday, October 5, 2026
📄 ePaper
EVENING EDITION
Homeతెలంగాణకాంగ్రెస్‌కు గుడ్‌బై.. చల్లా సమక్షంలో బీ.ఆర్‌.ఎస్‌.లోకి భారీ చేరికలు.

కాంగ్రెస్‌కు గుడ్‌బై.. చల్లా సమక్షంలో బీ.ఆర్‌.ఎస్‌.లోకి భారీ చేరికలు.

📰 Generate e-Paper Clip

కాంగ్రెస్‌కు గుడ్‌బై.. చల్లా సమక్షంలో బీ.ఆర్‌.ఎస్‌.లోకి భారీ చేరికలు.

అక్టోబర్ 5 ప్రజావాణి న్యూస్/సంగెం

సంగెం: కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు నాయకులు, కార్యకర్తలు ఆ పార్టీని వీడి బీఆర్‌ఎస్‌లో చేరారు. సంగెం మండలం కుంటపల్లి గ్రామ బీఆర్‌ఎస్ వార్డు మెంబర్ రౌతు అనిల్ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో పరకాల మాజీ ఎమ్మెల్యే చల్లా ధర్మారెడ్డి సమక్షంలో వారు బీఆర్‌ఎస్ కండువా కప్పుకున్నారు.
బీ.ఆర్‌.ఎస్‌.లో చేరిన వారిలో కాంగ్రెస్ గ్రామ పార్టీ ఉపాధ్యక్షుడు రౌతు శివకోటి, ఇందిరమ్మ కమిటీ సభ్యుడు రౌతు వరదరాజు, కాంగ్రెస్ నాయకులు రౌతు రవీందర్, అశోక్, వేణు, రాజు, నాగరాజు, మినుముల పరమాత్మతో పాటు పలువురు ఉన్నారు. గతంలో రేవంత్‌రెడ్డి గెలుపు అనంతరం కుంటపల్లి నుంచి వేములవాడ వరకు పాదయాత్ర చేసిన రౌతు వరదరాజు సైతం కాంగ్రెస్‌ను వీడి బీఆర్‌ఎస్‌లో చేరడం స్థానికంగా చర్చనీయాంశంగా మారింది.
కాంగ్రెస్‌పై చల్లా ధర్మారెడ్డి విమర్శలు.
ఈ సందర్భంగా చల్లా ధర్మారెడ్డి మాట్లాడుతూ. కాంగ్రెస్ పార్టీపై ఆ పార్టీ నాయకులు, కార్యకర్తలకే నమ్మకం లేకపోవడానికి కుంటపల్లిలో జరిగిన చేరికలే నిదర్శనమన్నారు. ప్రజాపాలన పేరుతో అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేస్తోందని విమర్శించారు.
ప్రజల సమస్యలను పరిష్కరించడంలో రేవంత్‌రెడ్డి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని ఆరోపించారు. అధికారంలోకి వచ్చేందుకు ఇచ్చిన హామీల అమలుపై కాంగ్రెస్ నాయకులు ప్రజలకు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. కాంగ్రెస్ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలు నచ్చకనే క్షేత్రస్థాయిలో పలువురు నాయకులు, కార్యకర్తలు బీఆర్‌ఎస్‌లో చేరుతున్నారని అన్నారు.బీఆర్‌ఎస్‌లో చేరిన ప్రతి నాయకుడు, కార్యకర్తకు సముచిత గౌరవం కల్పిస్తామని, పార్టీ బలోపేతానికి అందరూ సమన్వయంతో పనిచేయాలని చల్లా ధర్మారెడ్డి సూచించారు.
ఈ సందర్భంగా కొత్తగా బీఆర్‌ఎస్‌లో చేరిన నాయకులు మాట్లాడుతూ.. చల్లా ధర్మారెడ్డి నాయకత్వంలో పార్టీ బలోపేతానికి తమ వంతు కృషి చేస్తామని తెలిపారు.
కార్యక్రమంలో నాయకులు పురం శ్రీనివాస్, ఎలుకుర్తి బుచ్చిరెడ్డి, గొపతి సారంగం, గొపతి రాజు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.