.*గుండెపోటుతో చికిత్స పొందుతున్న కమ్లి కి గోలి శ్రీనివాస్ రెడ్డి గారు పరామర్శ*
*నాగర్ కర్నూల్ జిల్లా.*..
*కల్వకుర్తి నియోజకవర్గం ప్రతినిధి:*
*అక్టోబర్ 05(ప్రజావాణి)*
వెల్డండా మండలం:- నారాయణపూర్ తండాకు చెందిన బాణావత్ కమ్లి గారు గుండెపోటుతో బాధపడుతూ మన్నెగూడలోని ఓ ప్రవైట్ హిస్పిటల్ లో చికిత్స పొందుతున్నారు.విషయం తెలుసుకున్న తెలంగాణ రాష్ట్ర ఫుడ్ కమిషన్ చైర్మన్ గోలి శ్రీనివాస్ రెడ్డి గారు ఆసుపత్రికి వెళ్లి కమ్లి గారిని పరామర్శించారు.వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకుని, కుటుంబ సభ్యులకు ధైర్యం చెప్పారు.
అనంతరం తక్షణ ఆర్థిక సహాయంగా రూ.5,000/- రూపాయలు భర్త శంకర్ నాయక్ గారికి అందించడం జరిగింది.
ఈ కార్యక్రమం లో నారాయణపూర్ గ్రామ మాజీ సర్పంచ్ అంజి నాయక్, శ్రీను, బర్కం గణేష్,మణిపాల్ తదితరులు పాల్గొన్నారు.

