📄 ePaper
Epaper 2
Wednesday, September 30, 2026
📄 ePaper
EVENING EDITION
HomeతెలంగాణNalgondaగడ్డి పొదల్లో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం

గడ్డి పొదల్లో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం

📰 Generate e-Paper Clip

గడ్డి పొదల్లో అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతదేహం

ఉడుతలపల్లి శివారులో కలకలం.. ఘటనపై పోలీసుల దర్యాప్తు

నల్గొండ జిల్లా ప్రతినిధి ప్రజావాణి

నల్గొండ జిల్లా చండూర్‌ మండలం ఉడుతలపల్లి గ్రామ శివారులో రోడ్డు పక్కన గడ్డి పొదల్లో ఓ వ్యక్తి మృతదేహం కనిపించడం కలకలం రేపింది. మృతదేహాన్ని గుర్తించిన స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. మృతుడిని కనగల్‌ మండలం పోనుగోడు గ్రామానికి చెందిన బండమీది శ్రీనుగా పోలీసులు గుర్తించారు. శ్రీను కూరంపల్లి గ్రామంలో బైక్‌ మెకానిక్‌ షాప్‌ నిర్వహిస్తున్నట్లు స్థానికులు తెలిపారు. మంగళవారం రాత్రి ప్రమాదం జరిగి ఉండొచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహం లభించిన ప్రదేశం, పరిసరాలను పరిశీలిస్తూ ఘటనకు గల కారణాలపై దర్యాప్తు చేస్తున్నారు.

RELATED ARTICLES
- Advertisment -

Most Popular

App Icon

Install PRAJAVAANI App

Add to home screen for faster loading and latest updates.