అక్టోబర్ 1 నుండి 5 వరకు జరిగే సిపిఎం మోటార్ సైకిల్ యాత్రను జయప్రదం చేయండి ఐద్వా (AIDWA) కూనవరం మండల కమిటీ పిలుపు
ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం సెప్టెంబర్ 29
పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కూనవరం మండలం పోలవరం ముంపు మండలాలైన వి.ఆర్.పురం, కూనవరం, చింతూరు, ఎటపాక ప్రాంతాల నిర్వాసితుల సమస్యల పరిష్కారం కొరకు అక్టోబర్ 1 నుండి 5 వరకు సీపీఎం పోలవరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టనున్న మోటార్ సైకిల్ యాత్ర’ ను ముంపు ప్రాంత ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) కూనవరం మండల కమిటీ పిలుపునిచ్చింది.
మంగళవారం కూనవరం మండల పరిధిలోని ముల్లూరు, రేగులపాడు గ్రామాల్లో ఐద్వా నాయకురాళ్లు మడకం నాగమణి, బుచ్చమ్మల ఆధ్వర్యంలో విస్తృత ప్రచార సమావేశాలు నిర్వహించారు.*
ఈ సందర్భంగా ఐద్వా నాయకురాళ్లు మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు పేరుతో ఏళ్ల తరబడి విలీన మండలాల నిర్వాసితులను పాలకులు, అధికారులు తీవ్ర అన్యాయానికి గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
41.15 మీటర్ల కటాఫ్ ఎత్తు నెపంతో నిర్వాసితులకు అరకొర పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. 45.75 మీటర్ల ఎత్తు వరకు ముంపునకు గురయ్యే ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి ఒకేసారి పూర్తి స్థాయి ఆర్ & ఆర్ (R&R) ప్యాకేజీ అమలు చేయాలి. *గతం లో ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా రూ. 10 లక్షల పరిహారాన్ని తక్షణమే చెల్లించాలి. 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులకు ప్రత్యేక కుటుంబంగా గుర్తించి ప్యాకేజీ వర్తింపజేయాలి” అని వారు డిమాండ్ చేశారు.
ముంపు మండలాల్లో కనీస మౌలిక వసతులు కరువయ్యాయని, రోడ్లు, వైద్యం, విద్యుత్, తాగునీరు లేక మహిళలు, గర్భిణులు, బిడ్డలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు తక్షణమే హక్కు పత్రాలు (పట్టాలు) ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టడానికి, అధికారుల్లో చలనం తేవడానికి అక్టోబర్ 1 నుండి 5 వరకు 5 రోజుల పాటు ఐదు మండలాల్లో సాగే ఈ బైక్ యాత్రను జయప్రదం చేయాలని, ఈ పోరాటంలో మహిళలందరూ ముందు వరుసలో నిలబడాలని పిలుపునిచ్చారు.
ఈ ప్రచార కార్యక్రమంలో ఐద్వా స్థానిక నాయకురాళ్లు, బొడ్డు. కాంతమ్మ, శీలం. రాములమ్మ, బొగ్గా. సుబ్బమ్మ, సవలం. సీతమ్మ, కవిత,మహిళలు, ముంపు గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు ఐద్వా (AIDWA) కూనవరం మండల కమిటీ పిలుపు
ప్రజావాణి ప్రతినిధి కూనవరం మండలం సెప్టెంబర్ 29
పోలవరం జిల్లా చింతూరు డివిజన్ కూనవరం మండలం పోలవరం ముంపు మండలాలైన వి.ఆర్.పురం, కూనవరం, చింతూరు, ఎటపాక ప్రాంతాల నిర్వాసితుల సమస్యల పరిష్కారం కొరకు అక్టోబర్ 1 నుండి 5 వరకు సీపీఎం పోలవరం జిల్లా కమిటీ ఆధ్వర్యంలో చేపట్టనున్న మోటార్ సైకిల్ యాత్ర’ ను ముంపు ప్రాంత ప్రజలు, మహిళలు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని అఖిల భారత ప్రజాతంత్ర మహిళా సంఘం (ఐద్వా) కూనవరం మండల కమిటీ పిలుపునిచ్చింది.
మంగళవారం కూనవరం మండల పరిధిలోని ముల్లూరు, రేగులపాడు గ్రామాల్లో ఐద్వా నాయకురాళ్లు మడకం నాగమణి, బుచ్చమ్మల ఆధ్వర్యంలో విస్తృత ప్రచార సమావేశాలు నిర్వహించారు.*
ఈ సందర్భంగా ఐద్వా నాయకురాళ్లు మాట్లాడుతూ, పోలవరం ప్రాజెక్టు పేరుతో ఏళ్ల తరబడి విలీన మండలాల నిర్వాసితులను పాలకులు, అధికారులు తీవ్ర అన్యాయానికి గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
41.15 మీటర్ల కటాఫ్ ఎత్తు నెపంతో నిర్వాసితులకు అరకొర పరిహారం ఇచ్చి చేతులు దులుపుకోవాలని ప్రభుత్వం చూస్తోంది. 45.75 మీటర్ల ఎత్తు వరకు ముంపునకు గురయ్యే ప్రతి గ్రామానికి, ప్రతి కుటుంబానికి ఒకేసారి పూర్తి స్థాయి ఆర్ & ఆర్ (R&R) ప్యాకేజీ అమలు చేయాలి.
*గతం లో ప్రభుత్వం హామీ ఇచ్చిన విధంగా రూ. 10 లక్షల పరిహారాన్ని తక్షణమే చెల్లించాలి. 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులకు ప్రత్యేక కుటుంబంగా గుర్తించి ప్యాకేజీ వర్తింపజేయాలి” అని వారు డిమాండ్ చేశారు.
ముంపు మండలాల్లో కనీస మౌలిక వసతులు కరువయ్యాయని, రోడ్లు, వైద్యం, విద్యుత్, తాగునీరు లేక మహిళలు, గర్భిణులు, బిడ్డలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని వారు పేర్కొన్నారు. ఏజెన్సీ ప్రాంతంలో గిరిజనులు సాగు చేసుకుంటున్న పోడు భూములకు తక్షణమే హక్కు పత్రాలు (పట్టాలు) ఇవ్వాలని డిమాండ్ చేశారు.
ప్రభుత్వాల నిర్లక్ష్య వైఖరిని ఎండగట్టడానికి, అధికారుల్లో చలనం తేవడానికి అక్టోబర్ 1 నుండి 5 వరకు 5 రోజుల పాటు ఐదు మండలాల్లో సాగే ఈ బైక్ యాత్రను జయప్రదం చేయాలని, ఈ పోరాటంలో మహిళలందరూ ముందు వరుసలో నిలబడాలని పిలుపునిచ్చారు.
ఈ ప్రచార కార్యక్రమంలో ఐద్వా స్థానిక నాయకురాళ్లు, బొడ్డు. కాంతమ్మ, శీలం. రాములమ్మ, బొగ్గా. సుబ్బమ్మ, సవలం. సీతమ్మ, కవిత,మహిళలు, ముంపు గ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు